Breaking News

సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి

-లక్ష్య సాధన కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలి
-ర్యాగింగుకి దూరంగా ఉండాలి
-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డి ఎల్ ఎస్ ఏ), గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జి జి యు), గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టె క్నాలజీ (గైట్ )అటానమస్ కళాశాలల సమన్వయంతో డ్రగ్స్ దుర్వినియోగం… యాంటీ ర్యాగింగ్ మరియు రాజ్యాంగం అనే అంశంపై గైట్ ప్రాంగణంలోని విశ్వేశ్వరయ్య బ్లాక్ సెమినార్ హాల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహనా శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత హజరయ్యారు. ఈ సదస్సుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి సునీత గంధం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు, జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్. రాజశేఖర్ రాజు, జిజియూ రిజిస్టర్ డాక్టర్ పి. ఎం ఎం.ఎస్. శర్మ, గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి జయానంద కుమార్,రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాాల అసిస్టెంట్ ప్రొఫెసర్ Dr. Tetali రామారెడ్డితదితరులు హాజరై ప్రసంగించారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి సునీత గంధం మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా యువత సామాజిక స్పృహ కలిగి ఉండాలని సూచించారు. ర్యాగింగ్ వల్ల కలిగే నష్టాలను యువ ఇంజనీర్లకు వివరించారు. ఇంజనీరింగ్ అభ్యసిస్తున్న విద్యార్థుల అయినప్పటికీ , దేశ చరిత్ర గురించిన, వివిధ ఘట్టాల పైన, దేశంలో జరుగుతున్న ముఖ్యంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని నిర్ణయించుకొని ఆ లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. మన భారత రాజ్యాంగం గురించి దాని గొప్పతనం పై ఈ సందర్భంగా వివరించారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కే ప్రకాష్ బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాలకు బానిసలు అయితే భవిష్యత్తు జీవితం అంధకారం అవుతుందన్నారు. ఏ పని చేసిన తమ వ్యక్తిగత నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. తద్వారా తమ గమ్యాన్ని సులభతరంగా చేరుకుంటారన్నారు.

అదనపు ఎస్పీ ఎస్ ఆర్ రాజశేఖర రాజు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఏవిధంగా మోసాలకు పాల్పడుతున్నారో సోదాహరణంగా వివరించారు . చదువు పై ద్రుష్టి పెట్టాలని, ర్యాగింగ్ కు దూరంగా ఉండాలన్నారు. అందుకు పాల్పడిన వారికి చట్ట ప్రకారం శిక్షలు కఠినంగా ఉంటాయని భవిష్యత్తు నాశనం అవుతుందని వివరించారు.

కార్యక్రమంలో జి జి యు రిజిస్టర్ డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ, గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. జయానంద కుమార్, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తేతలి రామారెడ్డి, గైట్ అ టానమస్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ వి ఎస్ ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *