Breaking News

అన్నార్తులకు అండగా అన్న క్యాంటీన్లు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పేద, మధ్య తరగతి ప్రజలకు భరోసా కల్పిస్తూ రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల పునః ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రేపు స్వాతంత్ర దినోత్సవం నాడు గుడివాడలోని రామబ్రహ్మం మున్సిపల్ పార్కులో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన అన్న క్యాంటీన్ లు పేద మధ్య తరగతి ప్రజల ఆదరణ పొందాయి. సమస్యల పరిష్కారం కోసం రకరకాల పనుల కోసం, మారుమూల గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రమైన మచిలీపట్నం తదితర పట్టణ ప్రాంతాలకు వచ్చేవారు గతంలో అన్నా క్యాంటీన్లలో కేవలం 5 రూపాయలకే మూడు పూటలా ఆహారం లభించడం వారు అదృష్టంగా భావించేవారు.  గతంలో ఆటో రిక్షా కార్మికులు, హమాలీలు పారిశుధ్య కార్మికులు తోపుడుబండ్లు చిన్న బడ్డీ కొట్టు చిరు వ్యాపారులు కేవలం 5 రూపాయలకే లభిస్తున్న ఆహారం మూడు పూటలా తింటూ తమ జీవనం సాగించేవారు. వారి సంపాదనలో భోజన ఖర్చు చాలా మిగిలేది. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, పేదవారికి కూడు గుడ్డ ఇల్లు కల్పించాలని సంకల్పంతో కృషి చేశారు. అందుకే ప్రజలందరూ ఆనాడు ఎంతో అభిమానంగా ఎన్టీఆర్ ను “అన్నా” అని పిలిచేవారు. వారిచ్చిన స్ఫూర్తితో వారిని స్మరించుకుంటూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఏ ఆధారం లేని అనాధలు, అభాగ్యులకు, వృద్ధులకు అన్న క్యాంటీన్లు ఎంతగానో ఆసరాగా ఉండేవి. అయితే గత వైసిపి ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లు మూసివేయడంతోపాటు వాటిని అక్కడక్కడ వార్డు సచివాలయాలుగా మార్చి వేశారు. నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో పేదలు, మధ్య తరగతి ప్రజల్లో ఆశలు చిగురించాయి. మళ్లీ అన్న క్యాంటీన్లు తప్పకుండా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజునే ప్రకటించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే అన్న క్యాంటీన్ల పున ప్రారంభం దస్త్రంపై సంతకం చేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల తమకున్న ఆప్యాయతను చాటుకున్నారు. జిల్లాలో తొలి విడతగా గుడివాడ లో రెండు కేంద్రాలతో సహా మచిలీపట్నం, పెడన, ఉయ్యూరు పట్టణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు పున ప్రారంభించి అనార్తులను ప్రభుత్వం ఆదుకోనుంది.

అన్న క్యాంటీన్లో కేవలం 5 రూపాయల చొప్పున ఉదయం అల్పాహారం మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించడంతోపాటు స్వచ్ఛమైన తాగునీటీ సదుపాయం కూడా కల్పించడం చెప్పుకోదగ్గ విశేషం. అన్న క్యాంటీన్లో మూడు పూటలా అందుబాటులో ఉండే ఆహారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్ వీటిలో ఏదైనా ఒకటి చొప్పున చెట్ని /సాంబార్ తో కలిపి 5 రూపాయలకే, మధ్యాహ్నం, రాత్రి భోజనం వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్ పెరుగు, పచ్చడి తో కేవలం 5 రూపాయలకే అందించనున్నారు. ఆదివారం సెలవు, వారానికి ఒకరోజు స్పెషల్ రైస్ వడ్డిస్తారు. అల్పాహారం ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం లంచ్ మ.12.30 గంటల నుండి మ.3.00 గంటల వరకు, రాత్రి డిన్నర్ రా.7.30 గంటల నుంచి రా. 9 గంటల వరకు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *