Breaking News

బాలికను రక్షిద్దాం.. బాలికను చదివిద్దాం

-మహిళలను గౌరవించడం  ఇంటి నుంచే ప్రారంభం కావాలి.
-మహిళా గౌరవ ఉన్న సమాజం ఆర్థిక పురోభివృద్ధి చెందుతుంది.
-జిల్లాలోని ప్రతి అంగన్వాడి కేంద్రానికి ఇండక్షన్ స్టావ్ లను అందజేస్తా..
– మహిళల కొరకు ప్రవేశపెట్టే కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
-బేటి బచావో బేటి బడావో జిల్లా స్థాయి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న…
-ఎంపీ. దగ్గుబాటి పురందేశ్వరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలను గౌరవించడం  ఇంటి నుంచే ప్రారంభం కావాలని, మహిళా గౌరవ ఉన్న సమాజం ఆర్థిక పురోభివృద్ధి చెందుతుందని  పార్లమెంటు సభ్యులు  దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. బుధవారం స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో  నిర్వహించిన బేటి బచావో బేటి బడావో జిల్లాస్థాయి కార్యక్రమాన్ని  మహిళా శిశు సంక్షేమ శాఖ  ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి  పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, రూరల్  శాసనసభ్యులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి,  ఐసిడిఎస్ పిడి  విజయ కుమారి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  పార్లమెంట్ సభ్యులు  దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ సమాజంలో మహిళల ఆర్థిక స్థితిగతులు  మెరుగుపడిన  దేశం ఆర్థిక అభివృద్ధి దిశగా  కొనసాగుతుందన్నారు. “ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు నడియాడతారని” ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సంరక్షణ కొరకు పి సి పి ఎన్ డి టి యాక్ట్, వరకట్న నిషేధం, గృహింస చట్టం వంటి  అనేక పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.  మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లడం, వారి సంరక్షణ కొరకు చట్టాలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. సమాజంలో మహిళల పట్ల ఉన్న రుగ్మతులను పోగొట్టాలని లక్ష్యంతో  ప్రధానమంత్రి  శ్రీ నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రారంభించడం జరిగిందన్నారు.  మొగలలు దండెత్తిన అనంతరం దేశంలో సమాజంలో మార్పులు వచ్చాయని అప్పటినుంచి మహిళలు వంటింటికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆమె అన్నారు. సమాజంలో మహిళలు వారు ఎదుర్కొంటున్న సమస్యలను నుంచి చట్టాలు ద్వారా సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆడపిల్లలను పరిరక్షించడమే కాకుండా మన ఇంటిలో ఉన్న మగ పిల్లలను కూడా స్త్రీల పట్ల వాటి ప్రవర్తన గూర్చి తెలియజేసి వారిలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ఆమె అన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రభుత్వాసుపత్రిలో చేరిన యెడల వారికి 6వేల రూపాయలు తక్షణమే పౌష్టికాహారం కోసం అందించడం జరుగుతుందన్నారు. ఇంద్రధనస్సు పథకం కింద చంటి పిల్లలకు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వటం జరుగుతుందని ఆయన అన్నారు. ఆవాస్ యోజన పథకం కింద  నాలుగు కోట్ల లబ్ధిదారుల్లో 60 శాతం మహిళకే  కేటాయించడం జరిగిందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 11వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరుతుందని  త్వరలో మూడో స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్యవంతమైన సమాజం, ఆరోగ్యవంతమైన భారతదేశం కొరకు ఐసిడిఎస్ కార్యకర్తలు, ఆశ వర్కర్లు   చేస్తున్న సేవలకు ప్రతి ఒక్కరికి  ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. జిల్లాలో 1556 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయని ఈ కేంద్రాలు ఎన్నింటికి త్వరలో ఇండక్షన్ స్టావ్ లను అందజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ భేటీ బచావో భేటీ పడావో అనే కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ఒక వేడుకగా నిర్వహించుకుంటున్నామన్నారు. సమాజంలో ఆడపిల్లల శాతం రోజు రోజుకి తగ్గిపోతుందని ఆడపిల్లల జననాల శాతాన్ని పెంచేందుకుగాను చట్టపరమైన నియమాలను పాటించాలని  ఆమె అన్నారు. సమాజంలో చిన్నపిల్లల పై జరుగుతున్న అత్యాచారాల వలన ఫోక్సాక్ట్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వీటిని అరికట్టడంలో జిల్లా యంత్రాంతంగా మరింత కృషి చేయాలన్నారు. సమాజంలో స్త్రీలను గౌరవించడం అనేది ఇంటిలోని మగ పిల్లలకు వారి పట్ల ప్రవర్తించే విధానంపై వారిని చైతన్యవంతులను చేయవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉన్నదన్నారు. చిన్న పిల్లలు స్త్రీలపై నమోదవుతున్న కేసులు విషయంలో పోలీస్ శాఖ వారు చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొని క్రైమ్ రేటు తగ్గే విధంగా కృషి చేయాలని సూచించారు.  స్త్రీలు అవకాశాలు అందిపుచ్చుకోవడమే కాక వారు పూర్తిస్థాయిలో విజయం సాధించేందుకుగాను కుటుంబసభ్యులే వారికి ప్రోత్సహించి వెన్నుదన్నుగా ఉండాలన్నారు. సమాజంలోని మగ పిల్లల ప్రవర్తన తీరులో మార్పు వచ్చే విధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారిని చైతన్య పరచాలని కలెక్టర్ పేర్కొన్నారు.

సిటీ శాసనసభ్యులు  ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ స్త్రీలను గౌరవించడం అనేది మన ఇంటి వద్ద నుంచి ప్రారంభించాలన్నారు. మన ఇంటిలోని మన అమ్మను, చెల్లిని, అక్కను, మనం ఎంత బాగా గౌరవిస్తామో సమాజంలోని ఇతర స్త్రీల పట్ల కూడా అదే సోదరుభావం కలిగి ఉంటామని కనుక ప్రతి తల్లి తండ్రి తమ మగ పిల్లలకు పిన్న వయసు నుంచే స్త్రీ పట్ల మంచి ఆలోచన సదుద్దేశం కలిగే విధంగా పిల్లలు తీర్చిదిద్దాలని కోరారు. వ్యవస్థలను నడపడంలో స్త్రీకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదన్నారు. దీనిలో భాగంగానే రాజమహేంద్రవరంలో కూటమి ప్రభుత్వం తరఫున  ” మీ భద్రత మా బాధ్యత ” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని స్త్రీలపై ఎక్కడైనా దాడి గాని విమర్శలు గాని చేస్తే అట్టివారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తామన్నారు.

రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాలలో ముందంజలో ఉండే విధంగా వారి ఆర్థికంగానూ సామాజికంగానూ బలపడే విధంగా ప్రభుత్వం వారికి అన్ని అవకాశాలు కల్పిస్తుందని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. స్త్రీలు రాబోయే తరాలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే వారు మరింత శక్తివంతంగా తయారు కావాలని అందుకు సమాజంలో ఎటువంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనే విధంగా ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన అన్నారు.

జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ ఆడపిల్ల లేని ఇల్లు పువ్వులేని కొమ్మతో సమానమన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల అసమానతలు తొలగించేందుకుగాను దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఆడపిల్లల సంరక్షణ- వారిది చదివించడం అనే బృహత్తర కార్యక్రమం కింద బేటి బచావో బేటి బడావో అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, రూరల్  శాసనసభ్యులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి గర్భిణీ స్త్రీలకు చీర, గాజులు, అందించి శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించి సుఖప్రసవం జరగాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పడాల వీరభద్రరావు రచించిన “అల్లూరి సీతారామరాజు వాస్తవ చరిత్ర” బుక్లెట్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. విజయ కుమారి, మున్సిపల్ అదనప కమిషనర్ పియం సత్యవేణి, డిఆర్డిఏ పిడి ఎన్ వి ఎస్ మూర్తి, డిఇఓ వాసుదేవరావు, స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ నెంబర్ ఆదిలక్ష్మి, స్థానిక నాయకులు, అధికారులు, మహిళలుతదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *