Breaking News

జాతీయ అవార్డు అందుకున్న సర్పంచ్ కృష్ణకుమారి

-కేంద్ర మంత్రి చేతులమీదుగా అవార్డు అందుకున్న చల్లపల్లి సర్పంచ్ కృష్ణకుమారి
-భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిధిగా ఢిల్లీ వెళ్లిన సర్పంచ్
-దేశం మొత్తం మీద ఎనిమిది మంది సర్పంచులకు దక్కిన అరుదైన గౌరవం
-స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం, మన కోసం మనం ట్రస్ట్ విస్తృత కృషితో క్లీన్ & గ్రీన్, సింగిల్ యూస్ ప్లాస్టిక్ నియంత్రణ, ఓడిఎఫ్ ప్లస్ లక్ష్యాలు సాధించిన చల్లపల్లి గ్రామ పంచాయతీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఓడిఎఫ్ ఫ్లస్ సాధనతో పాటు సింగిల్ యూస్ ప్లాస్టిక్ నియంత్రణలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చల్లపల్లి గ్రామ పంచాయతీ పని చేస్తోందని కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. బుధవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓడిఎఫ్ ఫ్లస్ సాధన, సింగిల్ యూస్ ప్లాస్టిక్ నియంత్రణ, క్లీన్&గ్రీన్, గుడ్ గవర్నెన్స్ విభాగాల్లో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పని చేస్తున్న చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేతులమీదుగా జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ పురస్కారానికి భారతదేశం మొత్తం మీద ఎనిమిది మంది సర్పంచులు మాత్రమే ఎంపిక కాగా, వారిలో చల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి ఒకరు కావటం విశేషం. గత పదేళ్లుగా చల్లపల్లి గ్రామంలో డాక్టర్ డీ.ఆర్.కే.ప్రసాద్, డాక్టర్ టీ.పద్మావతి దంపతులు ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్న స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం, మన కోసం మనం ట్రస్ట్ విస్తృత కృషితో క్లీన్ & గ్రీన్, సింగిల్ యూస్ ప్లాస్టిక్ నియంత్రణ, ఓడిఎఫ్ ప్లస్ లక్ష్యాలు సాధించిన చల్లపల్లి గ్రామ పంచాయతీ 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ అరుదైన గుర్తింపు, గౌరవం స్వంతం చేసుకుంది. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం ప్రారంభం సమయంలో జడ్పీటీసీగా ఉన్న పైడిపాముల కృష్ణకుమారి స్వచ్ఛ సుందర చల్లపల్లి సాధనలో కీలక భాగస్వామ్యం వహించి, ఓడిఎఫ్ ప్లస్ సాధనకు ముఖ్య కారకురాలిగా నిలిచారు. తదుపరి చల్లపల్లి గ్రామ సర్పంచుగా ఎన్నికైన నాటి నుంచి పూర్తి సమయాన్ని చల్లపల్లి గ్రామ అభివృద్ధికి కేటాయించి, సుపరిపాలన, స్వచ్ఛ సుందర చల్లపల్లి సాధన కోసం డాక్టర్ డీ.ఆర్.కే.ప్రసాద్, డాక్టర్ టీ.పద్మావతి దంపతుల సహకారంతో, పాలకవర్గ సభ్యుల ప్రోత్సాహం, గ్రామ పెద్దలు సజ్జా చలపతిరావు, పంచాయతీ ఈఓ పీవీ మాధవేంద్రరావు, శానిటరీ ఇన్స్ పెక్టర్ సుధాకర్, సిబ్బంది అందిస్తున్న సంపూర్ణ సహకారంతో చల్లపల్లి గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయిలో అవార్డు సాధించిన సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి చల్లపల్లి గ్రామాన్ని దేశంలో గర్వించదగ్గ స్థాయిలో నిలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *