Breaking News

కలెక్టరేట్ ప్రాంగణంలో గౌరవ వందనం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆదర్శాలను పాటిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. తొలుత జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలసి మహాత్మా గాంధీ, భరతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలుగు తల్లి విగ్రహానికి కూడా వారు పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా మనం స్వాతంత్ర్యం సాధించుకున్నామన్నారు. వారంతా కష్టపడి సాధించిన ఈ స్వాతంత్ర్యం ఎంతో జాగ్రత్తగా మనం భద్రపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మనం మన బాధ్యతలను గుర్తు చేసుకుంటూ మన దేశానికి ఏమి చేయగలమో ఆలోచించుకొని మన దేశ అభివృద్ధికి కృషి చేయాలన్నారు . ఈ రోజు స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ వారి ఆదర్శాలను పాటించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ విద్యార్థులకు చాక్లెట్లు పంచిపెట్టారు. తదుపరి జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బోర్డుపై సంతకాలు చేశారు. తదుపరి జాతీయ పతాకాన్ని చేత పట్టుకొని విద్యార్థుల ర్యాలీని కలెక్టరేట్ నుండి ప్రారంభించారు. ర్యాలీలో పాల్గొన్న అధికారులు విద్యార్థులు అందరూ భారత్ మాతాకీ, జై జవాన్ జై కిసాన్, వందేమాతరం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇండియా ఈస్ ద సూపర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు సంయుక్త కలెక్టర్, ఇన్చార్జి డిఆర్ఓ శ్రీదేవి, మచిలీపట్నం ఆర్ డి ఓ ఎం వాణి, సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు వెంకటేశ్వర ప్రసాద్, కలెక్టరేట్ ఏవో వీరాంజనేయ ప్రసాద్, డిఎస్పి సుభాని కలెక్టరేట్ సిబ్బంది ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *