Breaking News

నాస్తిక కేంద్రంలో జాతీయ పతాకం ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నాస్తిక కేంద్రంలో జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. జాతీయ పతాకాన్ని నాస్తిక కేంద్రం అధ్యక్ష్యులు ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.సమరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా మనకు స్వాతంత్య్ర్యం లభించిందని యువత ఆ మహనీయుల త్యాగాల నుండి స్వాతంత్య్ర్యం పొందడం నుండి ప్రేరణపొంది భవ్యమైన భారతదేశాన్ని నిర్మించడానికి నడుం బిగించాలని ఆయన అన్నారు. భారతదేశం అన్ని రంగాలతో పాటు సైన్సు సాంకేతికత రంగాలలో ముందుకు వెళుతుందని నేటి యువత ఉత్సాహంతో విజ్నానాన్ని సముపార్జించి శాస్త్ర వేత్తలుగా ఎదగాలని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 78. సంవత్సరాలు వచ్చినప్పటికీ దేశంలో దారిద్ర్యం, అసమానతలు, అశాంతి ఉన్నాయని వాటి నిర్మూలనకు ప్రతీ భారతీయుడూ కృషి చేయాలని అన్నారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రు, ఆజాద్, పటేల్, బాలగంగాధర్ తిలక్, లాలాలజపతి రాయ్, భగత్ సింగ్ వంటి మహనీయుల జీవితాలు జాతికి ఎంతో ప్రేరణదాయకమని వారి నుండి యువత స్పూర్తిపొంది జాతి సమైక్యతకు భారతజాతి ఉన్నతికి అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ పతాక ఆవిష్కరణలో నాస్తిక కేంద్ర నిర్వాహుకులు డాక్టర్ మారు, నియంత, జి. రశ్మి, సకల, డాక్టర్ మెహన్ ప్రసాద్, డాక్టర్ పి. దీక్ష, సుబ్రమణ్యం మరియు వాసవ్య మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *