Breaking News

పేదరిక నిర్మూలన దిశగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ -2047

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వికసిత్ భారత్ – 2047 భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 అభివృద్ధి చెందిన రాష్ట్రoగా మార్చే లక్ష్యంగా జిల్లా అధికారులు అందురు కృషి చేయాలని జిల్లా అర్ధ గణాంక శాఖ అధికారి సాంబశివారెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 అమలులో భాగంగా విజన్ – 2024 – 29 సంవత్సరానికి 15 శాతం అభివృద్ధి రేటుతో అంచనాలను జిల్లా అధికారులు వారి శాఖల అభివృద్ధి నమూనాలను తయారు చేయుట కొరకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా జిల్లా అర్థ గణాoఖ శాఖ అధికారి మాట్లాడుతూ…. వికసిత భారత్ -2047 లక్ష్యానికి అనుగుణంగా 15 శాతం వృద్ధిరేటు సాధించి, తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం, పేదరికాన్ని నిర్మూలించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఆ దిశగా సంబంధిత అధికారులు ఐదు సంవత్సరాల ప్రణాళికలను రూపొందించాలని తెలిపారు. గ్రోత్ రేట్ సాధిస్తే తలసరి ఆదాయం పెరుగుతుందని, పేదల జీవన ప్రమాణం మెరుగవుతుందని తద్వారా పేదరిక నిర్మూలన చేయవచ్చు అని తెలిపారు. తిరుపతి జిల్లా తలసరి ఆదాయంలో రు. 2,51,704/- తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో 5 వ స్థానములో వున్నది. రాష్ట్ర ఆదాయాన్ని ప్రధానంగా 3 రంగాల నుండి లెక్కిస్త్తారు. అవి వ్యవసాయ రంగము, పరిశ్రమల రంగము మరియు సేవా రంగము. వ్యవసాము రంగము నందు తిరుపతి జిల్లా 12,883 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో 18 వ స్థానములో వున్నది, ప్రరిశ్రమల రంగము 24,505 కోట్లతో 2 వ స్థానములో వున్నది, సేవా రంగము 16,210 కోట్లతో 4 వ స్థానములో వున్నది. తిరుపతి జిల్లా వాటా రాష్ట్ర GSDP నందు సుమారుగా 5.18 శాతముగా వున్నది. దీనిని 6 శాతముగా అభివృద్ధి చేయ వలనని సమావేశము నందు సూచించడమైనది. జిల్లా లోని 5 గురు అధికారులకు ఆగష్టు 13 వ తేది నందు రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆగష్టు నెల 21 నుండి 31 వ తేది వరకు జిల్లా స్థాయి అధికారులకు సంభందిత శాఖాధిపతుల ద్వారా మరల శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడ మైనది. సంభందిత శాఖాధిపతుల ద్వారా శిక్షణా తరగతలు పూర్తి అయిన తరువాత, సంభందిత శాఖల నివేదికలను జిల్లా అర్థ గణాంక శాఖ తిరుపతి వారికి పంప వలసినదిగా తెలియజేయడ మైనది.

ఈ కార్యక్రమంలో అర్థ గణాంక శాఖ కార్యాలయపు సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, జిల్లా పట్టు పరిశ్రమల శాఖ అధికారి గీతారాణి, సెట్వెన్ సీఈఓ మురళి కృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *