-జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్ జాతోతు హుస్సేన్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజనుల అభ్యున్నతి కొరకు గౌ. జాతీయ ఎస్టీ కమిషన్ కృషి చేస్తోందని జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్, న్యూ ఢిల్లీ జాతోతు హుస్సేన్ పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహం నందు గిరిజన సంఘాల నాయకులతో మరియు గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులతో జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ సమావేశం నిర్వహించి వారికి సంబంధించిన సమస్యలపై చర్చించారు అలాగే వారికి సంబంధించిన గ్రీవెన్స్ అర్జీలను తీసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికార అధికారి సూర్య నారాయణ, పలు గిరిజన సంఘాల నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.