Breaking News

“2047 నాటికి వికసిత్ ఆంధ్ర ప్రదేశ్” భవిష్య ప్రణాళిక సిద్ధం చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాకు సంబంధించి “2047 నాటికి వికసిత్ ఆంధ్ర ప్రదేశ్” భవిష్య ప్రణాళిక (విజన్ డాక్యుమెంట్) సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. 2047 నాటికి వికసిత్ ఆంధ్ర ప్రదేశ్” భవిష్య ప్రణాళిక సిద్ధం చేయడానికి శనివారం కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులకు కార్యశాల నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యశాలలో పాల్గొని మాట్లాడుతూ వికసిత్ భారత్ భారత్@2047కి అనుగుణంగా “2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్” కింద రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోందన్నారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ఏటా 15% వృద్ధిని సాధించే లక్ష్యంతో రాష్ట్రానికి సంబంధించిన ముసాయిదా విజన్ డాక్యుమెంట్ ఖరారు దశలో ఉందన్నారు. 2024 అక్టోబరు 2న భారత ప్రధానమంత్రి ఈ పత్రాన్ని విడుదల చేస్తారని కలెక్టర్ తెలిపారు. వృద్ధి రేటు లక్ష్యాలు సాధించడానికి జిల్లా/మండల స్థాయిలో ఆర్థిక మరియు సామాజిక ప్రణాళికలు అవసరమన్నారు. దీని కోసం రాబోయే 5 సంవత్సరాలకు (2024-29) బలాలు, సంభావ్య ప్రాంతాలు, వృద్ధి ఇంజిన్‌లు మరియు అభివృద్ధి చెందుతున్న రంగాలను స్పష్టంగా గుర్తిస్తూ ఒక దృక్కోణ జిల్లాప్రణాళికను(perspective plan) కలిగి ఉండాలన్నారు.

2024-29 నాటికి ఏటా 15% వృద్ధిరేటు GR సాధించాలనే ప్రాథమిక లక్ష్యంతో ప్రతి జిల్లా ఇలాంటి విజన్ ప్లాన్‌లను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా విభాగం నీతి ఆయోగ్ మద్దతుతో ఈ పత్రాన్ని సిద్ధం చేస్తోందన్నారు. ఇదే తరహాలో జిల్లా స్థాయిలో జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలన్నారు. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రం ఈ డాక్యుమెంట్ రూపొందించిందని, దీనిని నమూనాగా పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు.

రాబోయే ఐదేళ్లలో 50 శాతం స్థూల విలువ జోడింపు GVA( gross value added ) సాధించే లక్ష్యంతో క్రింది స్థాయిలో నిజంగా ఏమి చేయగలమో, ఏమి చేస్తే జీవిఏ పెరుగుతుందో వాస్తవ ప్రణాళిక (realistic plan) రూపొందించాలన్నారు. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచగలిగితే మనం విజయవంతం అవుతామన్నారు. ఉదాహరణకు మనకు కాలువలు డ్రైన్లలో రైతులకు ఇబ్బంది కరంగా మారిన గుర్రపు డెక్క ను వినియోగించి క్లాత్ తయారు చేసే వీలుందని తెలిసిందని, తద్వారా ఇరిగేషన్ శాఖకు ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. పర్యాటక, పారిశ్రామిక రంగాలను మరింత అభివృద్ధి చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు మెండుగా లభించి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని, ఈ విధంగా పరిశోధనాత్మక ఆలోచనలతో వివిధ శాఖలలో అందుబాటులో ఉన్న వనరులతో వృద్ధి సాధించేందుకు ఈ డాక్యుమెంట్ రూపొందించాలని కలెక్టర్ జిల్లా అధికారులకు సూచించారు. ఈ కార్యశాలలో వివరించే విషయాలు సరిగ్గా అర్థం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. నియోజకవర్గ/ మండల స్థాయిల్లో కూడా కార్యశాలలు నిర్వహించుటకు షెడ్యూలు రూపొందించినట్లు, నియోజకవర్గ స్థాయి కార్యాశాలల్లో తప్పకుండా పాల్గొంటానని తెలిపారు. తొలుత సిపిఓ జి. గణేష్ కృష్ణ, డ్వామా పిడి జీవి సూర్యనారాయణ వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ డాక్యుమెంట్ సిద్ధం చేయడంలో విధి విధానాలు, నమూనా టెంప్లెట్స్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సమావేశంలో జెడ్పి సీఈవో ఆనంద్ కుమార్, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ జి గీతాబాయి, డీఎస్ఓ వి పార్వతి, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *