Breaking News

ఏడాదిలోగా ఇంటర్నేషనల్ మ్యాచ్ లాడేందుకు స్టేడియంని సిద్ధం చేస్తాం : ఎం.పి.కేశినేని శివనాథ్

-మంగళగిరి క్రికెట్ స్టేడియం పరిశీలన
-నిర్మాణ పనులపై అసంతృప్తి
-బీసీసీఐలో ఎసీఏ కి మంచి గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తా
-కాంట్రాక్టర్ తప్పిదం వల్లే స్టేడియం కు ఇబ్బందులు
-రాజధాని ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్టేడియం ఉండాలనేది ప్రజల కోరిక
-గత ప్రభుత్వం పట్టించుకోక ఈ స్టేడియం మూల పడింది

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని ప్రాంతంలో ఇంటర్నేషనల్ క్రికెట్ ఉండాలనేది ప్రజల కోరిక.. గత ఐదేళ్లుగా కాంట్రాక్టర్, గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మూలన పడింది. పనుల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయి. కాంట్రాక్టర్ తో లీగల్ ఇష్యూస్ సెటిల్ చేసుకొని రెండు మూడు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించి , ఏడాదిలోపు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లు ఈ స్టేడియంలో జరిగే విధంగా సిద్ధం చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివ నాథ్ చెప్పారు. మంగళగిరిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గ్రౌండ్ తో పాటు గ్యాలరీలను ఆదివారం ఎం.పి కేశినేని శివ నాథ్ పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్టేడియం నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయని, కాంట్రాక్టర్ల అనుభవ రాహిత్యం స్టేడియం నిర్మాణం చూస్తే అర్థమవుతుందన్నారు. స్టేడియం నిర్మాణం చేపట్టిన కంపెనీ ఐ వి ఆర్ సి ఎల్ దివాలా తీసింది.. కోర్టులో ఆ కంపెనీ దివాలా ప్రక్రియ నడుస్తోంది. కాబట్టి ముందుగా ఆ కంపెనీతో లీగల్ ఇష్యూ సెటిల్ చేసుకోవాలని తెలిపారు . లీగల్ ఇష్యూస్ సెటిల్ చేసుకోకుండా ఈ స్టేడియం లో ఏమి చేపట్టలేమన్నారు. ఒకవైపు ఆ కంపెనీ వాళ్లతో మాట్లాడుతూ, మరోవైపు ఎలాంటి జాప్యం జరగకుండా నిర్మాణ పనుల ప్రక్రియకి కావలసిన విధంగా స్టేడియాన్ని సిద్ధంగా ఉంచుతామన్నారు.

ఈ స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్ లు, రెస్ట్ రూములు , రిఫరీ అండ్ ఎనలిస్ట్ గది అనువుగా నిర్మించలేదు వాటిని పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రేక్షకులు గ్యాలరీలో నుంచి మ్యాచ్ వీక్షించేందుకు కొన్ని మార్పులు చేయాల్సి ఉందన్నారు.. ఈ మార్పులు చేయడానికి కన్సల్టెన్సీ కి అప్పగిస్తామని చెప్పారు.

ఈ సమస్యలపై అపెక్స్ బాడీ ఏర్పడిన తర్వాత వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చేస్తామన్నారు. జూన్ 8 అపెక్స్ బాడీ ఏర్పాటు అవుతుందని, ఈ లోపు స్టేడియం సమస్యలు తెలుసుకునేందుకు రావటం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు, స్టేడియం లేవని వాటిని నిర్మిస్తామని కొన్ని ప్రాంతాల్లో గ్రౌండ్లో లేవని ఆ క్రికెట్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తామని, క్రికెట్ అకాడమీలు కూడా అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. స్టేడియం నిర్మాణం పూర్తి అయ్యే లోపు రోడ్ల నిర్మాణం , అవసరాలు వాటర్ సప్లై పూర్తి చేస్తామన్నారు. రైల్వే డిఆర్ఎం కి ఆర్ఓబి గురించి లెటర్ రాయటం జరిగింది. నిర్మాణం పూర్తయ్యలోపు ఆర్ఓబి అయిపోతుందన్నారు. స్టేడియం కెపాసిటీ దృష్టిలో పెట్టుకొని డబల్ ఆర్ఓబి వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా క్రికెటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణమూర్తి, సెక్రటరీ రమేష్, మంగళగిరి సెంట్రల్ జోన్ అకాడమీ చైర్మన్ పురుషోత్తం, స్టేడియం మేనేజర్ భాస్కర్, క్రికెట్ ఉమెన్స్ వింగ్ మేనేజర్ బాపూజీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *