Breaking News

ఫోటోగ్రఫీలోని నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

-మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిరోజూ ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ఫోటోగ్రఫీలోని నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్యఅతిథిగా పాల్గొని, జిల్లా పరిషత్ సెంటర్ సమీపంలో గల కెమెరా సృష్టికర్త లూయిస్ జాక్వెస్ మండే డాగూరే కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన అసోసియేషన్ ఆధ్వర్యంలో మణిపాల్ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ కాలానుగుణంగా ఫోటోగ్రఫీలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, సాంకేతిక అభివృద్ధితో ఫిల్మ్ నుండి డిజిటల్ కెమెరాలకు రూపాంతరం చెంది ఎంతో అభివృద్ధిని సాధించింది అన్నారు. ప్రస్తుతం ప్రతి సెల్ ఫోన్ లోనూ అధునాతనమైన ఫీచర్లతో అందరికీ అందుబాటులోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఫోటోగ్రఫీలోని నూతన టెక్నాలజీని అందుపుచ్చుకోవాలని సూచించారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంత్రి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బండి రామకృష్ణ, ఎస్బిఐ రీజినల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, నాలుగో డివిజన్ కార్పొరేటర్ పినిశెట్టి ఛాయాదేవి, జిల్లా స్పోర్ట్స్ అధికారి ఝాన్సీ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, న్యాయవాది లంకిశెట్టి బాలాజీ, మచిలీపట్నం డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంఘం సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *