Breaking News

సోమవారం పి జి ఆర్ ఎస్ లో స్వీకరించిన 143 అర్జీలు

-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 143 అర్జిలు స్వీకరించడం జరిగిందనీ జిల్లాలో కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. సోమవారం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు తో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజల వద్దకు తీసుకొని వెళ్ళే క్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. అదే విధంగా ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా ప్రచురించే అధికారిక ఆహ్వాన పత్రిక లలో ప్రోటోకాల్ ప్రకారం జిల్లా రెవెన్యు అధికారి నుంచి ఆమోదం అవసరం అని స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో ప్రజల నుంచి వస్తున్న అర్జిలల్లో మండల, డివిజన్ పరిధిలో పరిష్కారం కోసం వొచ్చిన వాటిపై అక్కడికక్కడే ఆయా క్షేత్ర స్థాయి అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అర్జిదారుల సమక్షంలో స్థితి ని తెలుసుకుని, తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా పౌర సరఫరాలు 36 , రెవెన్యూ 35 , పోలీసు 25 , పంచాయతీ రాజ్ 16 , పురపకం 10 , ఇతర శాఖలు 21 అర్జీలు స్వీకరించి ఆన్లైన్ లో స్వీకరించినట్లు తెలియ చేశారు.

జాయింట్ కలెక్టర్ ఎస్. చిన రాముడు మాట్లాడుతూ, అర్జిలతో వచ్చిన వారి పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారీ సమస్యల పరిష్కార మార్గాలను సూచించడంలో సహకారం అందించాలన్నారు.  అధికారుల వద్దకు తమది కాని అర్జీదారుడు వచ్చిన సందర్భంలో సమయోచితంగా వ్యవహరించి సంబంధిత అధికారులతో మాట్లాడి వారి వద్దకు పంపడంలో చొరవ చూపాలని సూచించారు.

ప్రజల నుంచి స్వీకరించిన అర్జిలలో….
సీతానగరం మండలం చిన కొండేపూ డి కి చెందిన కే. శ్రీనివాస్, కె. రాంబాబు తదితరులు పురుషోత్తమ పట్నం ఇరిగేషన్ కాలువ కు 106 మందికి భూ పరిహారం చెల్లింపుల పై కలెక్టర్ కు అర్జీ ఇవ్వడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆర్డీవో రాజమండ్రి వారితో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా , జి వో 88 కి లోబడి చేపట్టవలసిన చర్యలపై, సంబంధిత పెండింగ్ చెల్లింపు వివరాలు పై స్టేటస్ కోరడం జరిగింది.

రాజమహేంద్రవరం అర్బన్ కి చెందిన వరద నాగేశ్వరరావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ను కలిసి ప్రైవేటు పాఠశాల దోపిడీ, నిర్దేశించిన ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా ప్రవేటు స్కూల్స్ నిర్వహణ విషయంలో అధిక ఫీజుల వసూళ్లు చేయడంపై కలెక్టర్ కు అర్జీ ఇవ్వడం జరిగింది. జిల్లా పాఠశాల విద్యాధికారి ఈ విషయమే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఆయా ప్రవేటు స్కూల్స్ నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించాలని నివేదిక అందచేయాలని ఆదేశించారు.

రాజమహేంద్రవరం కు చెందిన పల్లంటి శ్రీధర్ కు చెందిన పిడింగోయి లోని ఆర్ ఎస్ నెంబరు 472/1 , 474/2 మరియు 3 లలో తమకు చెందిన భూమి అన్యాక్రాంతం అయిందని , కబ్జా దారులకు రెవిన్యూ వారు సహకారం అందిస్తున్నారని అర్జీ ఇవ్వడం జరిగింది.

రాజమండ్రి  కి చెందిన తీగిరెడ్డి వేంకటేశ్వర రావు , తదితరులకు వేంకటేశ్వర మార్కెట్ సమీపంలో సొసైటీ వారికీ 1976 లో పట్టాలు ఇవ్వడం జరిగింది. సదరు భూములను స్వాధీనం చేసుకోవడం, దారికి అడ్డంగా గోడ నిర్మాణం చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కలెక్టర్ అర్జీ ఇవ్వడం జరిగింది. ఆర్డీవో సంబంధిత పత్రాలు పరిశీలన చేసి నివేదిక అందచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రజల నుంచి అర్జీలు సేకరించిన స్వీకరించిన వారిలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, దిశా పోలిస్ స్టేషన్ డిఎస్పీ కడలి వేంకటేశ్వర రావు, కే ఆర్ సి సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సర్ కృష్ణ నాయక్, టూరిజం ఆర్డి వి. స్వామీ నాయుడు, డీ ఎం పౌర సరఫరాలు టి. రాధిక, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *