Breaking News

రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన నేపధ్యంలో బాగంగా వినూత్న కార్యక్రమాలు

-ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్ ఆదేశముల మేరకు సోమవారం ఆర్.టి.ఏ జంక్షన్ వద్ద ట్రాఫ్ఫిక్ నియమ నిభందనలు మరియు హెల్మెట్ ధరించడం వలన కలుగు ఉపయోగాలపై అవగాహనా కార్యక్రమము చేపట్టినారు. ఈ నేపధ్యంలో పోలీస్ అధికారులు మరియు ఎన్.జి.ఓ. ల ఆధ్వర్యంలో ఈ రోజు రక్షాబంధన్ సందర్భంగా హెల్మెట్ ధరించి బైకులను నడిపిన వారిని, సీట్ బెల్ట్ ధరించిన వాహనదారులను, యూనిఫాం ధరించిన ఆటోలను నడుపు వారిని మరియు మోటారు వాహన చట్టాలను గౌరవించిన వాహనదారులను అభినందిస్తూ నలందా కళాశాల ఎన్.సి.సి.విద్యార్ధినులతో రక్షాబంధన్ కట్టించడం జరిగింది. అదేవిధంగా సదరు వాహనదారులు ఇతర వాహనదారులకు అవగాహన కల్పించే విధంగా వారిని ప్రోత్సహిస్తూ అభినందించడం జరిగినది.

ఈ సందర్భంగా డి.సి.పి. మాట్లాడుతూ…..వాహనదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ముందుగా చట్టాన్ని గౌరవిస్తూ, ప్రాణానికి విలువనిస్తూ సమాజానికి ఆదర్శంగా హెల్మెట్ ధరించిన మరియు చట్టాలను గౌరవించిన వాహనదారులను అభినందిచడం జరిగింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదములను నివారించుటకు సమాజంలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా చట్టాలను గౌరవిచాలని, ప్రతిఒక్కరూ తమతమ గమ్య స్థానములకు సురక్షితంగా వెళ్ళేందుకు రహదారి నియమ నిభందనలకు అనుగుణంగా మోటారు వాహన నిబంధనలను పాటిస్తూ వాహనములను నడపాలని తెలిపినారు.

ఈ అవగాహనా కార్యక్రమములో ట్రాఫిక్ డి.సి.పి. కె.చక్రవర్తి, ట్రాఫిక్ అడిషనల్ డి.సి.పి., డి.ప్రసాద్, ఇన్స్పెక్టర్లు, వీడు రోడ్ సేఫ్టీ సంస్థ ఎం. వాసు, నలందా కళాశాల ఎన్.సి.సి.విద్యార్ధులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *