విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా జ్వరాలు కలగకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మంగళవారం ఉదయం కృష్ణలంకలో ఉర్దూ స్కూల్ విద్యార్థులు, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిలో పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత మీద ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం నెలకొల్పారు. దోమల వల్ల కలిగే డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పాటించవలసిన పరిశుభ్రత తదితర అంశాల పైన అవగాహన కల్పించారు.
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ నగర పరిధిలో యాంటీ లార్వే ఆపరేషన్స్ ద్వారా దోమల నివారణను చేస్తున్నారని, ఒకవైపు డ్రైనలలో డిసిల్టింగ్ ప్రక్రియను పూర్తి చేస్తూనే, యాంటీ లార్వే ఆపరేషన్స్, కాలువల్లో పూడికలు తీయుట, మురుగు ప్రవాహిక ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా యం. ఎల్ ఆయిల్ స్ప్రే లాంటివి చేయడం ద్వారా దోమలను నియంత్రిస్తూ, ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే నిర్వహిస్తూ ప్రజలలో అవగాహన కల్పిస్తూ వారి పరిసరాల్లో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేసుకుంటూ ఆరోగ్యమైన జీవనాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ జోనల్ కమిషనర్ ఎస్ శివరామకృష్ణ, కార్పొరేషన్ సిబ్బంది, ఉర్దూ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.