విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ దోమల దినోత్సవ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు
మంగళవారం గాంధీనగర్, జింఖానాగ్రౌండ్‌నందు గల మలేరియా సబ్‌యూనిట్-5 పరిధిలోని పూర్ణానందంపేట ఎలిమెంటరీ స్కూల్, అయోధ్యనగర్ యూపిహెచ్‌సి స్టాఫ్, దేవీనగర్ యుపిహెచ్‌సి స్టాఫ్‌లతో ‘సర్ రోనాల్డ్ రాస్’ మలేరియా దోమను కొనుగొన్న శాస్త్రవేత్త ‘సర్ రోనాల్డ్ రాస్’ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘ప్రపంచ మలేరియా దోమల దినోత్సవం’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ, వైద్య సిబ్బందికి దోమల ద్వారా వచ్చు వ్యాధులు, తీసుకొనవలసిన జాగ్రత్తల గురించి శిక్షణా కార్యక్రమం మరియు అవగాహనా ర్యాలీ జరిగింది. ప్రతి ఇంటిలో పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత మీద ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్లో చైతన్యం నెలకొల్పారు. దోమల వల్ల కలిగే డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పాటించవలసిన పరిశుభ్రత తదితర అంశాల పైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్-5 అధికారి కె.రాజాంరాజు, హెల్త్ సూపర్‌వైజర్‌లు ఫాల్‌రీస్, నీరజకుమారి, హెల్త్ అసిస్టెంట్‌లు, రమేష్, రవికుమార్, శ్రీనివాసకుమార్, ఉమెన్ హెల్త్ సెక్రటరీలు, ఆషా కార్యకర్తలు, స్కూల్ టీచర్స్, విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …