Breaking News

ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం

-పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయంలో మంగళవారం కమిషనరేట్ పరిధిలోని డిప్యూటి పోలీస్ కమీషనర్లు, అన్ని డివిజన్ల అసిస్టెంట్ పోలీస్ కమీషనర్లు, ఇనస్పెక్టర్లు మరియు ఎస్.హెచ్.ఓ.లతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.యస్., నేర సమీక్షా సమావేశం నిర్వహించి మహిళలు, చిన్న పిల్లలపై నేరాలకు పాలపడే వారిపైన కఠిన చర్యలు, నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు, సైబర్ నేరాలు, గంజాయి, మద్యం అక్రమ రవాణా అరికట్టడం, దొంగతనం, కొట్లాట కేసులు, కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం, చెడు నడత కలిగిన వారిపై నగర బహిష్కరణలు, అలవాటు పడిన నేరస్తులపై పి.డి.యాక్ట్ లు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ మొదలగు అంశాలపై మరియు సి.సి.టి.ఎన్.ఎస్.,పై కులంకుషంగా చర్చించి అధికారులకు తగు సూచనలు మరియు సలహాలను అందించారు. అనంతరం రేపు అక్టోబర్ నెలలో జరుగబోవు దసరా మహోత్సవాలలో ధర్శాననికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చర్యలు గురించి చర్చించడం జరిగింది.

ఈ సందర్భంగా నగర పోలీస్ కమీషనర్  పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడుతూ…
-నగరంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు అన్ని పోలీస్ స్టేషన్ల పరిదిలో ఫుట్ పెట్రోల్లింగ్/ విసిబుల్ పోలిసింగ్ మరియు ఈ పహారా నిర్వహించి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మరియు అనుమానిత వ్యక్తులపై నిఘా ఏర్పాటు చెయ్యాలని, ముఖ్యంగా నిర్మానుష్య ప్రదేశాలలో ( చీకటి ప్రదేశాలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగు ప్రదేశాలలో) లా & ఆర్డర్, టాస్క్ ఫోర్సు, స్పెషల్ బ్రాంచ్ మరియు ఆర్మడ్ రిజర్వ్ సిబ్బంది కో ఆర్డినేషన్ తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పటిష్ట నిఘా ఏర్పాటు చెయ్యాలని తెలిపారు.
-కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి, వాటిని కోర్ట్ నందు చార్జ్ షీట్ ఫైల్ చేసి, సి.సి.నెంబర్లు వచ్చేవిధంగా చూడాలి అని తెలిపారు.
-పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులు, విశేషాలు వంటి వాటిని పైఅధికారులు దృష్టికి చేరే విదంగా మరియు ఫిర్యాదికి చట్టబద్ధంగా త్వరితగతిన న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు.
-బ్లేడ్ బ్యాచ్, రౌడీ, కే.డి, సస్పెక్ట్, గంజాయి సేవించే వ్యక్తుల మధ్య గాని గ్రూప్ ల మధ్య గాని అంతర్గత విభేదాలు ఉన్నాయా అన్న విషయం గమనించి. వారికి కౌన్సిలింగ్ చెయ్యాలని చెప్పారు.
-మహిళా సంబంధిత కేసులలో ఎటువంటి అలసత్వం లేకుండా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
-నాటు సారా తయారి, అక్రమ మద్యం, గంజాయి మొదలైన అక్రమ రవాణాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఎస్.ఈ.బి. అధికారులకు ఆదేశాలు జారి చేసారు.
-దిశా వాహనాల సిబ్బంది నిర్మానుష్య ప్రదేశాలలో గస్తి ఎక్కువగా తిరిగేవిధంగా చూడాలని ఆదేశాలు జారి చేసారు.
-పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ వాటి సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి.
-దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
-మహిళలు, చిన్న పిల్లలకు సంబందించి నమోదైన కేసుల్లో తప్పనిసరిగా నిందితులకు కఠిన శిక్షలు పడేలా కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ విధానం ద్వారా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
-విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని, ఎటువంటి ఒత్తిడులకు తలొగ్గకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తూ విధినిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అధికారులను హెచ్చరించారు.
ఈ సమావేశంలో డి.సి.పి.లు గౌతమీ షాలి ఐ.పి.యస్., కె.ఎం.మహేశ్వర రాజు ఐ.పి.ఎస్., టి.హరికృష్ణ, కె.చక్రవర్తి, అడిషినల్ డి.సి.పి.లు టి.కనకరాజు, కృష్ణమూర్తి నాయుడు, డి.ప్రసాద రావు, ఏ.సి.పి.లు, ఇనస్పెక్టర్లు మరియు ఎస్.ఈ.బి. అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *