Breaking News

మరణించిన ఏకలవ్య టీచర్ల కుటుంబాలకు రూ.15 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యోగం

-గుర్తింపు లేని పాఠశాలలు, వసతి గృహాలు నడిపే వారిపై కఠిన చర్యలు
-రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సాలూరు నియోజక వర్గం పాచిపెంట మండలంలో ఏకలవ్య పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు వాగుదాటుతూ మృతి చెందడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఒక్కొక్క కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యోగాన్ని ప్రకటించడం జరిగిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ఆమె పాత్రి కేయులతో మాట్లాడుతూ మూడు రోజుల క్రితం సాలూరు నియోజక వర్గం పాచిపెంట మండలంలో ఏకలవ్య పాఠశాలకు చెందిన మహేష్ (29), ఆర్తి (26) అనే ఉపాధ్యాయులు వాగు దాటుతూ దురదృష్టవశాత్తూ మృతి చెందడం జరిగిందన్నారు. నిన్న రాత్రి ఆర్తి పార్థివ దేహం, ఉదయం మహేష్ పార్థివ దేహం దొరికాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయా పార్థివ దేహాలను విమానంతో తీసుకువెళ్లి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందన్నారు. కేంద్ర సాయంగా రూ.10 లక్షలు, రాష్ట్ర సాయంగా రూ.5 లక్షలు మొత్తం రూ.15 లక్షలను ఒక్కొక్క కుటుంబానికి అందజేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఆయా కుటుంబాలకు చెందిన వారికి ఉద్యోగం కూడా ఇవ్వడంతో పాటు, అన్ని విదాలుగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆమె తెలిపారు.

గుర్తింపులేని పాఠశాలలు, వసతి గృహాలు నడిపేవారిపై కఠిన చర్యలు…
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలోని ప్రైవేటు వసతి గృహంలో ముగ్గురు చిన్నారులు కలుషిత ఆహారానికి మృతిచెందిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. ఆ ప్రైవేటు వసతి గృహంలో ఉన్న విద్యార్థులు అందరినీ దగ్గర్లోని ప్రభుత్వ వసతి గృహం చేర్పించి విద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపులేని పాఠశాలలు, వసతి గృహాలు ఏమన్నా ఉంటే వెంటనే వాటిని గుర్తించి, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆమె తెలిపారు. వారి ఆదేశాల మేరకు అన్నిజిల్లాల కలెక్టర్లను, ఐ.టి.డి.ఏ. పి.ఓ.లను, ఎం.ఆర్.ఓ.లను, ఎం.ఇ.ఓ.లను, డి.ఇ.ఓ.లను ఆదేశించడం జరిగిందని ఆమె తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *