Breaking News

మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాలి

-మాతా శిశు మరణాలు, మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు చేపట్టాలి
-అంగన్వాడీ కార్యకర్తలు వారు విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలో ఉండి సేవలు అందించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేసి,ప్రభుత్వాశయాలకు అనుగుణంగా మహిళల అభివృద్ధికి మరియు శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలని, మాత శిశు మరణాలు, మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖపై సిడిపీఓ లు, సూపర్వైజర్లు, డిసిపిఓ, డి.ఎం మహిళా ప్రాంగణం వన్ స్టాప్ సెంటర్ అధికారి, తదితరులతో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషి చేసి, ప్రభుత్వాశయాలకు అనుగుణంగా మహిళల అభివృద్ధికి, సాధికారతకు మరియు శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతగా పనితీరు ఉండాలని, మాతా శిశు మరణాలు, మాల్ న్యూట్రిషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మాతా శిశు మరణాలు సంభవించకుండా ఆసుపత్రులలో ప్రసూతి కాన్పులు జరిగేలా చూడాలని ఆదేశించారు. మిషన్ వాత్సల్య పై సమీక్షిస్తూ సక్రమంగా అమలయ్యే విధంగా చర్యలు ఉండాలని మహిళా ప్రాంగణం ద్వారా మహిళలకు ఉపయోగపడే స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు మార్కెట్లో ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రానున్న మూడు నెలలలో మహిళా ప్రాంగణం, శక్తి సదన్ ల నందు అనాధలు, వదిలి వేయబడిన వారు, భర్త లేని, సింగిల్ ఉమెన్ మహిళలకు 18 సం. నుండి 60 సం. ల లోపు వారిని మరింత మందిని నిబంధనల మేరకు చేర్చుకుని వారికి వసతి , ఉచిత ఆహారం, ఆరోగ్య, వైద్య, లీగల్ సేవలు అందేలా చర్యలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న మూడు నెలల్లో పూర్తి స్థాయిలో సదనం పనిచేసేలా చూడాలని ఆదేశించారు. సఖి సదనం, కళాశాల విద్యార్థుల సదనం ఇవన్నీ సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకొని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాళహస్తి బాలల సదనం పనితీరు మెరుగుపడాలని సూచించారు. స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ(SAA) నందు పోలీసు వారు గుర్తించిన బాలలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆమోదం మేరకు అనాధ పిల్లలు, వదిలివేయబడిన పిల్లలు, తప్పిపోయిన పిల్లలను 18 సంవత్సరాలు లోపు వారిని నిబంధనల మేరకు చిల్డ్రన్ హోం, అబ్జర్వేషన్ హోం నందు చేర్చుకుని తగు చర్యలు చేపట్టాలని సూచించారు. అంగన్వాడీ పిల్లలకు ఇచ్చే గుడ్లు సక్రమంగా అందేలా నాణ్యతగా ఉండేలా పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని సిడిపిఓలు సూపర్వైజర్లకు ఆదేశించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని, వాస్తవ వివరాలు తెలిపి అందులోని సమస్యలను అధిగమించి లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంగన్వాడీ కార్యకర్తలు వారు విధులు నిర్వర్తిస్తున్న గ్రామాలలో అందుబాటులో ఉండాలని సిడిపిఓలు సూపర్వైజర్లు ఎలాంటి కంప్లైంట్లు లేకుండా పనితీరు ఉండాలని ఆదేశించారు. బాల్య వివాహాలు జరగకుండా గ్రామాలలో అవగాహన కల్పించాలని సూచించారు. సఖి వన్ స్టాప్ సెంటర్ మెటర్నిటీ ఆసుపత్రి పరిసరాల్లో ఏర్పాటు చేసిన దానిలో చేరే గృహ హింసకు గురైన,లైంగిక వేధింపులకు గురి అయిన బాలలు, మహిళలకు వైద్య, లీగల్, పోలీస్ సంబంధ అంశాలలో సేవలు అందించాలనీ, సదరు సెంటర్ ఇంఛార్జి సంబంధిత అధికారులు బాధితులకు భరోసా కల్పించి వారికి అన్ని విధాలా అండగా నిలవాలని సూచించారు. సిబ్బందికి సంబంధించిన అంశాలు సమన్వయం చేసుకుని అన్ని అంశాలలో పురోగతి ఉండేలా పనితీరు ఉండాలని సూచించారు. జువెనైల్ జస్టిస్ బోర్డు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. అలాగే నిర్దేశించుకున్న 100 రోజుల లక్ష్యాలను సాధించేలా ప్రణాళికా బద్ధంగా పురోగతి సాధించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారిని జయలక్ష్మి, డిసిపిఓ శివ శంకర్, వన్ స్టాప్ సెంటర్ ఇన్చార్జి సిడిపిఓలో సూపర్వైజర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *