Breaking News

దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీ పాలసీ రూపొందిస్తాం.

-రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతాం
-ఔత్యాహిక పారిశ్రామికవేత్తలకు ఊతమిస్తాం.
-సింగిల్ విండో పాలసీన సమర్థవంతంగా అమలు చేస్తాం.
-యువతలో నైపుణ్యాలు పెంచేవిధంగా చర్యలు తీసుకుంటాం.
-పాలసీ రూపకల్పనలో అందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం.
-యువతకు ఉపాధి కల్పన పై దృష్టిపెడతాం.
-నేటి యువత టెక్నాలజీ అందిపుచ్చుకునే విధంగా నైపుణ్య శిక్షణ అందిస్తాం.
-పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తాం.
-కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాల శాఖామాత్యులు.

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
వికసిత్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీ పాలసీని రూపొందించనున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖామాత్యులు కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. నూతన ఇండస్ట్రీ పాలసీ రూపకల్పన లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ, సీఐఐల సంయుక్త ఆధ్వర్యంలో స్టేక్ హోల్డర్స్ సమావేశం విజయవాడలోన ఓ ప్రైవేట్ హోటల్ లో బుధవారం జరిగింది. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు టీ.జి. భరత్ వర్చువల్ గా తన సందేశాన్ని అందించారు. స్టేక్ హోల్డర్స్ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తుండటం శుభసూచకమన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతామని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఊతమిస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. సింగిల్ విండో పాలసీని సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. సింగిల్ విండో పాలసీ అమలులో భాగంగా నెలకు రెండు సార్లు సమావేశాలు నిర్వహించి దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, టెక్స్ టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో రంగం, బయోటెక్ రంగాలతో పాటు అన్ని రంగాలకు ప్రాధాన్యత కల్పించి ఏపీని పారిశ్రామిక రంగంలో దేశంలోనే టాప్ గా నిలబెట్టాలన్న లక్ష్యంతో ముందు సాగుతున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు, గ్రాడ్యూయేట్లు ఉన్నారని ఇది రాష్ట్రానికి బలమని, వారిలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంచి స్థానికంగానే వారికి ఉపాధి కల్పించడమే ధ్యేయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు యూనివర్శిటీలతో, కాలేజీలతో మాట్లాడి కరిక్యులమ్ లో కొన్ని మార్పులు చేసి వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇండస్ట్రీలకు అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువత తక్కువగా ఉన్నారని తమ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందింపుచ్చుకునేలా యువతకు తర్ఫీదు ఇస్తే వారు ఇక్కడే మంచి ఉద్యోగాలు సాధిస్తారని గుర్తించడం జరిగిందన్నారు. నూతన ఇండస్ట్రీ పాలసీ రూపకల్పనలో సూచనలు, సలహాలు అందించాలనుకునే వారు ఈ మెయిల్, పోస్ట్ ద్వారా కూడా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా నూతన ఇండస్ట్రీ పాలసీ కూడా సీఎం చంద్రబాబు ప్రకటించనున్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ కు మొదటి అడుగుగా నూతన ఇండస్ట్రీ పాలసీ ఉండబోతున్నారు. దేశంలోనే పారిశ్రామికంగా ముందున్న ఐదు రాష్ట్రాల ఇండస్ట్రీల పాలసీలను స్టడీ చేసి మన రాష్ట్రాంలో వాటి రిజల్ట్స్ ఎలా ఉంటాయని పరిశీలించి బెస్ట్ పాలసీని అందించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
మెడ్ టెక్ పార్క్ తరహాలోనే రాష్ట్రంలో మరిన్ని సెక్టార్ బేస్డ్ ఇండస్ట్రీ పార్క్ లను అభివృద్ధి చేయనున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ ఇండస్ట్రీస్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. నేటి స్పీడ్ యుగంలో రోజు రోజుకు టెక్నాలజీ మారిపోతుందని, ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆ నైపుణ్యాలు మన యువతకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం (పిపిపి పార్టనర్ షిఫ్) తో అద్భుతాలు సృష్టించవచ్చాని, ఎంఎస్ఎంఈ ల స్థాపనతో స్థానిక యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుందన్నారు. ఎంఎస్ఎంఈల స్థాపనకు ప్రత్యేకంగా కృషి చేస్తామన్నారు. టెక్స్ టైల్ రంగంలో పెద్ద సంఖ్యలో యువతకు ఉపాధి, ఉద్యోగకల్పన జరుగుతుందని మంత్రి తెలిపారు.
పరిశ్రమల శాఖామాత్యులు టిజి భరత్ వర్చువల్ గా స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితమే సీఎం చంద్రబాబు ఒక సిఈవోలా పనిచేసి రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారించారని, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించడంతో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు, కంపెనీలు తరలివచ్చాయని గుర్తుచేశారు. నూతన ఇండస్ట్రీ పాలసీని వంద రోజుల ప్రణాళికలో భాగంగా సెప్టెంబర్ లో తీసుకురానున్నామన్నారు. నూతన ఇండస్ట్రీపాలసీ బెస్ట్ గా ఉండేవిధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాలసీ రూపొందించడంలో పెట్టుబడులే లక్ష్యంగా ముందకు వెళుతున్నామని, పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పిస్తామని హామి ఇచ్చారు. రోడ్లు, విద్యుత్, నీరు తదితర మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి టి.జి. భరత్ తెలిపారు.
సమవేశంలో పాల్గొన్న స్టేక్ హోల్డర్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారి సూచనలు, సలహాలను ఖచ్చితంగా స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. అలాగే స్టేక్ హోల్డర్స్ సమస్యలను విన్నవించగా వాటిని పరిష్కరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామి ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ చేనేత, జౌళి శాఖ సెక్రటరీ కె. సునీత, ఇండస్ట్రీస్ శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, పరిశ్రమల వాణిజ్య శాఖ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్, చేనేత, జౌళి శాఖ కమిషనర్ జి. రేఖారాణి, సీఐఐ ఏపీ ఛైర్మన్ వి.మురళీ కృష్ణ, సీఐఐ ఏపీ మాజీ ఛైర్మన్ జెఎస్ఆర్కె ప్రసాద్, ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ అభిషేక్ కిషోర్, స్టేక్ హోల్డర్స్ పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *