విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ ఖరీఫ్ సీజనులో మండలానికి ఒకటి చొప్పున జిల్లాలోని అన్ని మండలాల్లో ఇండిగ్యాప్ సర్టిఫికేషన్ నిమిత్తం రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో అనుసంధానించి, మేలైన వ్యవసాయ పద్ధతుల పొలంబడి కార్యక్రమాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ పధకము సమర్ధవంతంగా అమలు చేయాలనే సంకల్పంతో బుధవారం జిల్లా వ్యవసాయ అధికారిణి, సాకా నాగమణెమ్మ ఆధ్వర్యంలో విజయవాడ లోని ఏ .పి .ఏ.ఓ అసోసియేషన్ హాలులో వ్యవసాయశాఖ లోని డివిజన్ మరియు మండల స్థాయిల అధికారులకు శిక్షణా కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో జిల్లా వ్యవసాయ అధికారి సాకా నాగమణెమ్మ, కమిషనేర్ అప్ అగ్రికల్చర్ వారి కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ అఫ్ అగ్రికల్చర్, ch. బాలు నాయక్, డిప్యూటీ డైరెక్టర్ అఫ్ అగ్రికల్చర్, డిటిసి, డిఆర్ సి, టి. మాధవి లత, జిల్లాలోని సహాయ వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయ అధికారులకు మరియు జిల్లా వ్యవసాధికారి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. ch .బాలు నాయక్ మాట్లాడుతూ విత్తనం నుండి విక్రయం వరకు సమగ్ర ఎరువుల యాజమాన్యము, సమగ్ర సస్య రక్షణ, సమగ్ర కలుపు యాజమాన్యము మరియు సమగ్ర నీటి యాజమాన్యము వెరసి సమగ్ర పంటల యాజమాన్యము, నిర్వహణ మరియు మేలైన వ్యవసాయ పద్ధతుల్లో అవగాహన కల్పించి, సాంకేతికంగా సుశిక్షితులుగా చేసి, పర్యావరణ అనుకూల సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపి, అవసరమైన మేర మాత్రమే ఎరువులు, పురుగుమందులు వాడుతూ, సాగు ఖర్చు తగ్గించుకొని, అధిక పంట దిగుబడులు పొంది రైతులకు సాధికారత కల్పించడమే ఈ ఇండి గ్యాప్ పొలంబడి ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.
రైతులు ఎఫ్ .పి.ఓ లలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇండ్. గ్యాప్ పద్ధతులు పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ ( APSOPCA) వారి ద్వారా రైతులు స్కోప్ సర్టిఫికెట్ ను పొందడంవంటి అంశాలను వివరించారు. ఏ పి సేంద్రియ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ వారి స్కోప్ సర్టిఫికెట్ ను ఇచిన పిదప డిజి రెడీ (DRC సర్టిఫికెట్ ను ఎఫ్ .పి.ఓ వారు పొందవచ్చునని తెలియజేశారు. దీని ద్వారా 135 దేశాలలో సొంతంగా రైతు లేదా రైతు గ్రూపులు వారి ఉత్పత్తులను అమ్ముకునే అవకాశం ఉందన్నారు. ఈ విషయాల మీద . పొలంబడి కార్యక్రమం ద్వారా క్షేత్ర స్థాయిలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించవలసినదిగా సూచించారు.