Breaking News

సైబర్ కమాండోలకు వర్క్ షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయి, నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు చేసేకంటే, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మరియు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం ద్వారా ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయాలనే ప్రధాన ఉద్దేశ్యంతో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ ఏ.సి.పి. తేజేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీస్ కమీషనరేట్ పరిదిలోని పోలీస్ సిబ్బందిని మరియు మహిళా పోలీసులను సైబర్ కమాండోలుగా ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఈ రోజు కమాండ్ కంట్రోల్ నందు పోలీస్ కమిషనర్ సైబర్ కమాండోలకు వారు చేయు విధి విధానాలపై అవగాహన కోసం వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…. ఎన్.టి.ఆర్ పోలీస్ కమీషనరేట్ పరిదిలో సైబర్ నేరాలపై ప్రజలలోభారీ ఎత్తున అవగాహన కల్పించి ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేందుకు వినూత్న పద్దతిలో ముందుకు పోవడానికి ఈ సైబర్ కమాండోలను ఏర్పాటు చేయడం జరిగిందని, సైబర్ క్రైమ్ అంటే ఏమిటి ? వివిధ రకాల సైబర్ నేరాల గురించి, సైబర్ సిటిజన్ మొబైల్ యాప్, 1930 కాల్ సెంటర్, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP), ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I 4c), కొన్ని రకాల కేసు స్టడీలు, బ్యాంక్ స్టేట్మెంట్ ఎనాలసిస్, గోల్డెన్ అవర్ యొక్క ప్రాముఖ్యత, ప్రతిరోజు జరుగుతున్న సైబర్ నేరాల యొక్క వివరాలు, సైబర్ సోల్జర్స్ ను ఏ విధంగా పనిచేయించాలి, వృత్తి నైపుణ్యం మెరుగుపరుచుకోవడానికి ప్రత్యేక కోర్సులు, సైబర్ నేరాల పరిశోధన ఎలా చేయాలి అనే అంశాలపై కూలంకుశంగా వివరించడం జరిగింది.

అదేవిధంగా సైబర్ నేరాలు అనేవి ఆన్ లైన్ లో గేమ్స్ , ఆన్ లైన్ లోన్స్ , QR కోడ్ స్కాన్ చేయడం, పార్ట్ టైం జాబ్స్ అంటూ వాట్సాప్ ద్వారా, పేస్ బుక్, INSTAGRAM, ట్విట్టర్, టెలిగ్రాం మొదలైన యాప్ ల ద్వారా ఫేక్ ఐ.డి.లు, మెసేజ్ రూపంలో వచ్చే లింకులు, బ్యాంక్ KYC అప్ డేట్, OLX ద్వారా తక్కువ రేట్ కు వస్తువులు అమ్ముతున్నట్లు చూపించడం ద్వారా, డిల్లీ, ముంబాయి పోలిసులము అని చెప్పి తప్పుడు కాల్స్ చేయడం ద్వారా, కస్టమర్ కేర్ ద్వారా వచ్చే కాల్స్ మరియు మెసేజ్ ల ద్వారా ఏ విధంగా సైబర్ నేరాల భారిన పడతారు అనే విషయాలపై పూర్తిగా అవగాహన కల్పించడం జరిగింది. సైబర్ క్రైమ్ ఏ.సి.పి. తేజేశ్వరరావు, యస్. ఐ . మూర్తి వివిధ కేసుల గురించి తెలియబరిచారు.

అనంతరం పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్ ను సందర్శించి నిరంతరం సి.సి.కెమెరాలను పర్యవేక్షించాలని, ట్రాఫిక్ రద్దీ పై ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేయాలని సిబ్బందికి తగు సూచనలు చేశారు.

పోలీస్ కంట్రోల్ రూం ను పరిశీలించి సిబ్బందిని వారు చేయు వివరాలను అడిగి తెలుసుకుని డైల్ 100, 112 మరియు ఎస్.ఓ.ఎస్ కాల్స్ లను వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి వాటి యొక్క ఫీడ్ బ్యాక్ ను సేకరిచాలని, విధులు నిర్వహించే సమయంలో డైనమిక్ గా వ్యవహరించాలని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ తోపాటు, డి.సి.పి.లు గౌతమి షాలి ఐ.పి.ఎస్., ఏ.బి.టి.ఎస్. ఉదయరాణి ఐ.పి.ఎస్., టి.హరికృష్ణ, సైబర్ క్రైమ్ ఏ.సి.పి. తేజేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు గుణరామ్, పి.శ్రీను, వాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, హనీష్ మరియు 200 మంది సైబర్ కమాండోలు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *