Breaking News

నెలటూరు రైతు సేవా కేంద్రాన్ని (ఆర్ ఎస్ కె) తనిఖి చేసిన జెసి చిన్న రాముడు

చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో మౌలిక సదుపాయాలు, రికార్డుల నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు.

శనివారం ఉదయం చాగల్లు మండలం నెల్లటూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని పౌర సరఫరాలు మార్కెటింగ్ , రెవెన్యు అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా ముందస్తుగా జిల్లాలోని అన్ని “ఆర్.ఎస్.కె” లలో మౌలిక సదుపాయాలు, అనుబంధ పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. గత సీజన్లో రైతుల నుంచి ధాన్యం సేకరణ సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన రికార్డుల పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో చెల్లింపులు పూర్తి చెయ్యాల్సి ఉంటుందన్న ఆదేశాల మేరకు ఇప్పటి నుంచి యంత్రాంగం అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తూకం, తేమ శాతం, గన్ని బ్యాగులు, అనుబంధ రికార్డులు సిద్దం చేసుకోవాలన్నారు.

ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా మేనేజర్ )పౌర సరఫరాల) టి. రాధిక , ఏడి మార్కెటింగ్ ఎం సునీల్ వినయ్, చాగల్లు తాహాసిల్దార్ ఎం. మేరీకమ్మ, ఆర్ ఎస్ కె సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *