Breaking News

పొట్టీలంక నుంచి కడియపు లంక వరకూ బోటు విహారం

-కలెక్టర్ ప్రశాంతి

కడియం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇకో టూరిజం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పొట్టిలంక గ్రామం నుంచి కడుపు లంక కడియపులంక వరకు కెనాల్ లో బోటింగ్ విహారం చేసే విధానం లో భాగంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం ఉదయం పర్యాటకశాఖ అధికారులతో కలిసి కడియం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి , జిల్లా పర్యటక అధికారులకు సూచనలు చేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చేసేందుకు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ తగిన ప్రతిపాదనలను అందజేయాలన్నారు. అందులో భాగంగా ఈకో టూరిజం పై రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ఇటీవల కడియపు నర్సరీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించామన్నారు. మరింత మంది పర్యాటకులను ఆకర్షించే రీతిలో బోటింగ్ కార్యకలాపాలను చేపట్టాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా పొట్టిలంక గ్రామం నుంచి కడియపులంక గ్రామం వరకు కెనాల్ లో బోటింగ్ కు అనుగుణంగా ప్రతిపాదనలను, డిపిఆర్ ను సిద్ధం చేయాలని ఆదేశించారు. 2027 లో జరిగే గోదావరి పుష్కరాలకు ముందుగానే ఈ ప్రాంతంలో పర్యాటకపరంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాల్సి ఉందన్నారు. పబ్లిక్ ప్రవేటు భాగస్వామ్యం తో ప్రతిపాదన సిద్ధం చేయాలన్నారు. అందులో భాగంగా సుందరీకరణ, గ్రీనరీ, ఆర్చింగ్ పాయింట్స్, రెస్టారెంట్ తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు. కలెక్టర్ వెంట పర్యాటక శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ వి. స్వామి నాయుడు జిల్లా టూరిజం అధికారి పి. వెంకటాచలం, తహసిల్దార్ కె. పోసి బాబు, ఎంపిడిఓ కె. రత్న కుమారి తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *