Breaking News

కాలుష్య రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

-చెత్త నియంత్రణ  ఇంటి నుంచే ప్రారంభం కావాలి
-పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న శానిటేషన్ కార్మికులకు మనం ఎంతో రుణపడి ఉన్నాం.
-ద్విచక్ర వాహనదారులందరూ  తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలి.
-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిశుభ్రత కాలుష్య రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతతో చెత్త నియంత్రణ దిశగా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. శనివారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఘన వ్యర్థాల నిర్వహణ, ఆర్థిక వ్యవస్థ పట్ల సుస్థిరం మరియు వనరుల సామర్థ్యంపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథి గా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి.నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంథం సునీత మాట్లాడుతూ నేటి పరిస్థితుల దృష్ట్యా వ్యర్థాల నిర్వహణ మరియు పర్యావరణ స్థిరత్వం కోసం చాలా కీలకమన్నారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ సేవలలో రీసైక్లింగ్ కీలకమైన అంశం అన్నారు. చెత్త నియంత్రణ  ఇంటి నుంచే ప్రారంభం కావాలని, అప్పుడే గ్రామ పట్టణ ప్రాంతాలు కాలుష్య రహితంగా ఉంటాయన్నారు. ప్రతిరోజు చెత్త సేకరణ చేస్తూ, డ్రైన్స్ శుభ్రపరుస్తు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న శానిటేషన్ కార్మికులకు మనం ఎంతో రుణపడి ఉన్నామన్నారు. రాజమహేంద్రవరంలో ఒక ఫ్యాక్టరీ నుంచి వెలబడుతున్న కాలుష్య సమస్యను నియంత్రించాలంటూ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు ఫిర్యాదులు కూడా రావడం జరిగిందన్నారు.
ప్రతి ఒక్కరూ కాలుష్యం నియంత్రణ దిశగా బాధ్యతతో ప్లాస్టిక్ తో కూడిన చెత్త నియంత్రణే లక్ష్యంగా కృషి చేయాలి అన్నారు. పర్యావరణ పరిరక్షణ కాలుష్య నియంత్రణ వంటి అంశాలు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందన్నారు.
ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితముగా స్వతంత్ర భారతావనిలో నేడు మనం వాటి ఫలాలను అనుభవిస్తున్నామన్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టు వారి మార్గదర్శకాలు మేరకు ఈరోజు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామన్నారు.

ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని కోరారు. అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఆ కుటుంబం రోడ్డు పాలు అవుతుందన్నారు. న్యాయ పరంగా ఎటువంటి సమస్యలు ఉన్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. సెప్టెంబర్ 14 వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోకాదళత్ లో కక్షిదారులు రాజీ మార్గం ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ శానిటేషన్ ప్రక్రియ అనేది ఒక డిపార్ట్మెంట్ కో వ్యక్తికో సంబంధించిన అంశం కాదని, ఇది సమాజ బాధ్యతని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిశుభ్రత, కాలుష్య రహిత సమాజం కొరకు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలన్నారు. ప్రతి ఇంటిలో తడి చెత్త, పొడి చెత్త వేరువేరు డస్ట్ బిన్స్ లో వేయడం వల్ల వాటిని సేకరించే శానిటేషన్ సిబ్బందికి సులభంగా ఉంటుందన్నారు. ప్లాస్టిక్ ఇతర వ్యర్థ పదార్థాల్లో కలవడం వల్ల వాటిని సపరేట్ చేసి డిస్పోజల్ చేయడం కష్టమవుతుందన్నారు. ప్లాస్టిక్ తో కూడిన ఇతర వ్యర్థ పదార్థాలను డ్రైన్స్ లో వేయడం డ్రైన్ పారుదలకు అడ్డంకి ఏర్పడి కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతతో పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ చెత్తను డస్ట్ బిన్ లోనే వేయడం వలన ఆహ్లాదకరమైన మంచి వాతావరణాన్ని మనమే సృష్టించుకోగలుగుతామన్నారు. ఆదిశగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతతో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో శానిటేషన్ సిబ్బందికి సహకరించాలన్నారు.

జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నగరాల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, దానితోపాటు చెత్త కూడా పెరుగుతుందన్నారు. చెత్త నియంత్రణ ఇంటినుంచే సాధ్యమయ్యే దిశగా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. నగరంలోని చెత్త నియంత్రణకు పోలీస్ శాఖ తరపున నగరపాలక సంస్థకు తమ వంతు సహకారాన్ని అందించడం జరుగుతుందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు జిల్లా నాయిసేవాధికారి సంస్థ తరఫున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నేను కూడా భాగస్వాములు అయినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు.

మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ కాలుష్య రహిత నగరముగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దే విధంగా తగు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నమన్నారు. ప్రతిరోజు నగరంలో ఒక లక్ష 60 వేల టన్నులు చెత్త సేకరణ చేస్తున్నామన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా రీసైకిల్, రీయూజ్, కాలుష్యాన్ని నియంత్రణ పై పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, డిపిఓ రాంబాబు, ఎంహెచ్ఓ వినూత్న తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *