Breaking News

“యూత్ ఫెస్టివల్ 2024”

-యువతలో హెచ్ఐవి/ఎయిడ్స్ పై అవగాహన
-29 ఆగస్టు – మారథాన్ రెడ్ రన్ & క్విజ్ పోటీలు
-డా ఎన్ వసుంధర

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు, మార్గదర్శకాలతో జిల్లాలో యువతలో హెచ్.ఐ.వి. ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆద్వర్యంలో యూత్ ఫెస్టివల్ కార్యక్రమమును ఆగస్టు 29 న నిర్వహించడం జరుగుతున్నదని తూర్పు గోదావరి జిల్లా లేప్రసి,ఎయిడ్స్ మరియు టిబి అధికారిణి డా. ఎన్ .వసుంధర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్ట్ 29 న నిర్వహించే యూత్ ఫెస్టివల్ కార్యక్రమములో భాగముగా డిగ్రీ చదువుతున్న విద్యార్ధిని/విద్యార్ధులకు ట్రాన్సజెండర్ల తో ఆగస్టు 29వ తేది 5 కే నిర్వహిస్తున్నా మన్నారు. ఐదు కిలో మీటర్ల మారథాన్ కార్యక్రమమును ఉదయం 6.30 లకు రాజమహేంద్రవరం లోని వై జంక్షన్ నుండి గోదావరి నదీ తీరాన ఉన్న ఇస్కాన్ టెంపుల్ వరకు వయా నందం గనిరాజు జంక్షన్, కంబాల చెరువు, దేవి చౌక్ , గోకవరం బస్ స్టాండ్, మున్సిపల్ పార్క్, పుష్కర ఘాట్, గోదావరి బండ్ ద్వారా నిర్వహించి విజేతలకు కలక్టరు వారి చేతుల మీదుగా ప్రధమ బహుమతి రూ.5,700/- . 4000/- (Boys/Girls/Transgender) విభాగాలలో ఇవ్వడం జరుగుతుందన్నారు. అదీ విధంగా 8వ, 9వ మరియు 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ ఉన్నత పాటశాల విద్యార్ధిని/ విద్యార్ధులకు 29వ తేది ఆగస్టు 2024న మద్యాహ్నం 2 గంటలకు జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు టీబీ శాఖాధికారి వారి కార్యాలయములో జిల్లా స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకి ప్రధమ బహుమతి గా రూ.7000/- ద్వితీయ బహుమతి రూ.4000/- ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ యూత్ ఫెస్టివల్ కార్యక్రమములో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్ధిని విద్యార్ధులు ఫోన్ నెంబర్లు 9581531960 / 9949495022 లని సంప్రదించవలసిన కోరి ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *