Breaking News

ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో బిఎల్ఓలు ఇంటింటి ఓటర్ సర్వే చేస్తున్నారని, కేంద్ర ఎన్నికల సంఘం నుండి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజంట్లు సర్వేలో పాల్గొని పరిశీలించవచ్చని తూర్పు ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి(ఈఆర్ఓ) మరియు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఎఎస్ గారు తెలిపారు. శనివారం కమిషనర్ చాంబర్ లో ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వారి ఆదేశముల మేరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025లో భాగముగా బిఎల్ఓలు నగరంలోని 2 నియోజకవర్గాల్లో ఇంటింటి ఓటర్ సర్వే చేస్తున్నారన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ స్టేషన్ కు ఒకరిని చొప్పున బూత్ లెవల్ ఏజెంట్ ను నియమించుకోవచ్చని, వారు సర్వేని పరిశీలించ వచ్చని తెలిపారు. అధికారికంగా బూత్ లెవల్ ఏజంట్లు మినహా పార్టీ నాయకులు, కార్యకర్తలు బిఎల్ఓతోపాటు సర్వేలో పాల్గొనకూడదన్నారు. స్పెషల్ సమ్మరి రివిజన్ లో భాగంగా బిఎల్ఓలు అక్టోబర్ 18 వరకు ప్రతి ఇంటిని సందర్శించి అర్హత కలిగిన కొత్తగా నమోదు కావలసిన ఓటరులను నమోదు చేయుట, నగరం నుండి శాశ్వతముగా వదిలి వెళ్ళిన వారిని మరియు మరణించిన వారిని తొలగించుటకు, ఇంటి నెంబర్లు, ఇతర వివరములలో ఉన్న తప్పులను సవరణ చేయుటకు చర్యలు తీసుకుంటారన్నారు. పాత డోర్ నంబర్లు ఉన్న ఓటర్లకు కొత్త డోర్ నంబర్లు మార్చడం జరుగుతుందన్నారు. దీనిపై ఇప్పటికే బీఎల్వోలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వటం జరిగిందనీ, నిర్లక్ష్యం లేకుండా బాధ్యతగా విధులు నిర్వహించాలని బీఎల్వోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. వారితో పాటుగా బూత్ లెవల్ ఏజెంట్ లు పాల్గొని సహకరించేలా రాజకీయపార్టీలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత క్యాంపెయిన్ ని విజయవంతంగా చేపట్టడం ద్వారా రానున్న ఏ ఎన్నిక అయినా నగరంలోని 2 నియోజకవర్గాల నుండి ఓటింగ్ శాతం పెంచడానికి వీలు కల్గుతుందని తెలిపారు.
సమావేశంలో ఈఆర్వో, అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, ఏఈఆర్వో, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ పద్మ, ఓంకార్ (టిడిపి), డి.జాన్ బాబు (వైఎస్సార్సీపీ), బి.సునీల్ కుమార్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), ఎస్.కార్తీక్ (సిపిఐ(ఎం), టి.సేవా కుమార్ (అమ్ ఆద్మీ పార్టి) పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *