విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ LBS నగర్ కదరమ్మ కొట్టు సెంటర్ నందు సోమవారం శ్రీకృష్ణ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని స్వయంగా ఉట్టి కొట్టడం జరిగినది…
ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు, కృష్ణ జన్మాష్టమి హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి అని, భగవద్గీతలోని గీతాచార్యుడు, గోపాల, మధుసూదనుడు అనే అనేక నామాలతో పిలువబడే శ్రీకృష్ణుడి జన్మదినంగా ఈ పండుగను జరుపుకుంటాము అని.. కృష్ణ జన్మాష్టమి భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జి పైడి శ్రీను, చిరబోయిన రాజా, మరియ, రాజు, బింది ఆంజనేయులు, మాధవ, సాయి, జటాదర్, కసియ్య,కేబుల్ రాజా తదితరులు పాల్గొన్నారు.