Breaking News

గణేష్ మండపాలకు అనుమతులు తప్పనిసరి

-అర్బన్, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చెయ్యండి
-స్థానికంగా వేడుకలు నిర్వహించే నిర్వాహక కమిటీలతో సమావేశం నిర్వహించాలి
-గణేష్ పందిళ్ళు కు అర్బన్ లో మునిసిపల్ కమిషనర్, మండల స్థాయిలో తహసీల్దార్ చే అనుమతులు జారీ
-పెండాల్సు భధ్రత అత్యంత ప్రాధాన్యత
-సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలి
-సేఫ్టీ ధ్రువపత్రాలు జారీ చేసిన చోట్ల మాత్రమే పందిళ్ళు ఏర్పాటుకు అనుమతి
-పర్యావరణ పరిరక్షణ దిశగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి
-ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడవద్దు
-రూట్ మ్యాప్ ప్రకారం నిమజ్జనం సమయాలు కేటాయింపు సహకారం అందచేయాలి
-అధికారులు ఎటువంటి వత్తిళ్ళు కు గురికాకుండా నిబంధనలు పాటించాలి
-ఫైర్ సేఫ్టీ కు తగిన విధంగా చర్యలు తీసుకోవాలి
-కొవ్వూరు డివిజన్ పరిధిలో విగ్రహాల నిమజ్జనం అదీ డివిజన్ లో చేపట్టాలి
-శబ్ద కాలుష్యం లేకుండా ప్రజలకు అసౌకర్యం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
-కలెక్టరు పి ప్రశాంతి, ఎస్పి కిషోర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయచవితి సందర్భంగా పందిళ్ళు ఏర్పాటుకు, సంబంధిత అనుమతుల కోసం ఏక గవక్ష విధానంలో అనుమతులు ఇవ్వాలని కలెక్టరు పి ప్రశాంతి ఆదేశించారు. అన్నీ సమన్వయ శాఖల మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం కోసం క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి అనుమతులు జారీ చెయ్యాలనీ ఎస్పీ డి నరసింహా కిషోర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ డి నరసింహా కిషోర్, జెసి ఎస్. చిన్న రాముడు, డి ఆర్వో జి నరసింహులు తదితరులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, వినాయక చవితి పండుగను అత్యంత జాగ్రత్తగా నిర్వహించే క్రమంలో మునిసిపల్ , మండల స్థాయిలో అనుబంధ శాఖలతో సమావేశం నిర్వహించాల్సి ఉందన్నారు. ఆగస్టు 30 లోగా సమావేశం నిర్వహించి మార్గదర్శకాలు సిద్దం చెయ్యాలనీ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం, అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో వ్యక్తిగతం హాజరై నిబంధనలు ఖచ్చితంగా పాటించడం జరుగుతున్నాదా ? లేదా ? పరిశీలన చేయాలన్నారు. ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరుగకుండా అధికారులు ముందస్తుగా సూచనలు ఇవ్వడం జరగాలి.. అధికారుల పర్యవేక్షణలో కమిటి నిర్ణయం తీసుకుని అనుమతులు జారీ చేస్తుందని తెలిపారు. రెవెన్యు, పోలిస్, మునిసిపల్, పంచాయతీ, అగ్ని మాపక, మత్స్య శాఖ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, వైద్య ఆరోగ్య శాఖ, తదితర అధికారులతో కమిటీ ఏర్పాటు చేసుకుని, ఏరోజు వచ్చిన దరఖాస్తులు ఆరోజే క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు మేరకు అనుమతి ఇవ్వాలన్నారు.

నిమజ్జనం కు చెందిన తేదీ కూడా ముందుగ తీసుకోవడం, నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు లో సమూహాన్ని పరిమితం చేయాలన్నారు. కొవ్వూరు డివిజన్ పరిధిలోని విగ్రహాల నిమజ్జనం కొవ్వూరు,అధికారులు పేర్కొన్న ప్రాంతాల్లో చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఆమేరకు పందిళ్ళ నిర్వాహకులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా పంచాయతీ అధికారి తగిన భద్రత చర్యలను పర్యవేక్షణ చేపట్టాల్సి ఉందన్నారు. శబ్ద కాలుష్యం లేకుండా ప్రజలకు అసౌకర్యం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, నిర్వాహకులకు ఆమేరకు అవగాహనా కల్పించాలని కోరారు.

ఎస్పీ డీ నరసింహా కిషోర్ మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత నిర్వహిస్తున్న అతి పెద్ద వేడుక, శబ్ద కాలుష్యం లేకుండా మైక్ సెట్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెండాల్స్ వద్ద పోలీస్ పెట్రోలింగ్ తో పాటు నిర్వాహకులు కూడా ఒకరిని అందుబాటులో ఉంచాలన్నారు.  విగ్రహాలు నిమజ్జనం చేయడం కోసం ముందుగా సమయం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ కోసం సహకారం అందచేయాలని , అశ్లీల నృత్య ప్రదర్శనలు, కళా ప్రదర్శన లేకుండా చూడాల్సిన బాధ్యత ఆయా నిర్వహకులదే అన్నారు. నిమజ్జనం చేయడం కోసం ఎక్కడ నిమజ్జనం చెయ్యాలో ప్రాంతాన్ని వివరించి అక్కడే నిమజ్జనం చేయడం జరగాలని, తద్వారా ట్రాఫిక్ నిర్వహణా వ్యవస్థ కంట్రోల్ చెయ్యడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విగ్రహాలను  నిమజ్జనం చేసే పంటు పైకి ప్రజలను అనుమతించడం జరగదని ఎస్పి తెలియజేశారు. డీఎస్పీలు వ్యక్తిగత పర్యవేక్షణ ద్వారా రూట్ మ్యాప్ సిద్ధం చేసి వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించాలన్నారు

ఈ సమావేశంలో జిల్లా అధికారులు డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *