Breaking News

జిల్లా స్థాయి ఎంప్యానెల్‌మెంట్ కమిటి తొలి సమావేశం

-ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద డీసిల్టేషన్ పై బోట్స్ మ్యాన్ సొసైటి ద్వారా త్రవ్వకాలు విధి విధానాలు పై చర్చ
-జెసి చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఇసుక డీసిల్టేషన్ త్రవ్వకాలు మరియు అప్పగించే పద్ధతి పై విధి విధానాలు రూపొందించడం కోసం ఎన్ ప్యానల్మెంట్ కమిటి నిర్ణయం అనుసరించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం, తదనుగుణంగా నిర్ణయాత్మక మైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చైర్మన్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్థాయి ఎంప్యానెల్‌మెంట్ కమిటి తొలి సమావేశం ఛైర్మన్ గా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి చిన్న రాముడు మాట్లాడుతూ, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద తొమ్మిది డీసిల్టేషన్ రీచ్‌లను గుర్తించడం జరిగిందన్నారు . పర్యవరణ అనుమతుల తదుపరి కార్యాచరణ కు అనుగుణంగా ఇసుక త్రవ్వకాలు బోట్స్ మ్యాన్ సొసైటి అధ్వర్యంలో గుర్తింపు పొందిన, అర్హత కలిగిన వారి ద్వారా చేపట్ట వలసి ఉంటుందన్నారు. అందులో భాగంగానే జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బ్యారేజీకి సంబంధించిన ఫోర్‌షోర్ ప్రాంతంలో బోట్స్ మెన్ సొసైటీలు నిర్వహించే డీసిల్టేషన్ ఆపరేషన్‌లో త్రవ్వకం చేసిన మెటీరియల్‌ రవాణా, అప్పగించే పద్ధతిని పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యుల ద్వారా త్రవ్వకం సజావుగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు.

జిల్లా స్థాయి లో జెసి ఛైర్మన్ గా, సమన్వయ కర్త గా ధవళేశ్వరం చీఫ్ ఇంజనీర్, గోదావరి డెల్టా సిస్టమ్, సభ్యులుగా ధవళేశ్వరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గోదావరి హెడ్ వర్క్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ , డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా గనులు & జియాలజీ అధికారి, జిల్లా సహకార అధికారి, కొవ్వూరు సబ్ కలెక్టర్, రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ అధికారి, తహశీల్దార్ లు కొవ్వూరు, తాళ్లపూడి, రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ లను నియమించడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఆర్డీఓ కే ఎల్ శివ జ్యోతి, ధవళేశ్వరం గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజనీర్ పి. పుల్లారావు, ఈ ఈ ఆర్.. కాశీ విశ్వేశ్వర రావు, డీపీఓ డి. రాంబాబు, డిటీసి కెవి కృష్ణ రావు, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి వ్య శ్రీనివాస్, పొల్యూషన్ కంట్రోల్ అధికారి బి. సందీప్ రెడ్డి, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది…

-సాటిలైట్ సిటీ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల… -పిడింగొయ్యి గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *