Breaking News

బిజెపిని మరింత బలోపేతం చేయాలి… :  పురందరేశ్వరి

విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
బిజెపిని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒబిసి మోర్చా ఆధ్వర్యంలో భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో శుక్రవారం బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పురందేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలోని పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమ కోసం బిజెపి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక సభలు సమావేశాలను విస్తృతంగా నిర్వహించి పార్టీని బలోపేతం చేయాల న్నారు. బిజెపి సిద్ధాంతాల మేరకు ఆరు సంవత్సరాలకు ఓసారి సభ్యత్వ నమోదు కార్యక్రమం మూడు సంవత్సరాలకి మధ్యంతర సభ్యత్వం నిర్వహిస్తున్నామన్నారు. సెప్టెంబర్ ఒకటో తారీఖున భాజపా సభ్యత్వాలన్నీ రద్దు అవుతాయని సెప్టెంబర్ 2న ప్రధాని మోడీ బిజెపి సభ్యత్వాన్ని తీసుకొని కార్యక్రమాన్ని మొదలు పెడతారని తెలియజేశారు. ప్రతి ఒక్క కార్యకర్త విధిగా సెప్టెంబర్ 2 నుంచి సభ్యత్వాన్ని తీసుకోవాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ మాత్రమే కుల మతాలకతీతంగా అవినీతి రహిత పాలన అందిస్తుంది తెలిపారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగుల శ్రీనివాస్ గోపి మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం ఎలాంటి అవినీతి మరకలేకుండా ప్రజాహితంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు. 18 కోట్ల సభ్యత్వాలను నమోదు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని తెలియజేశారు. కార్యక్రమంలో బిజెపి ఏపీ ఇంచార్జ్ జాతీయ కార్యవర్గ సభ్యులు కొసరాజు, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, దయాకర్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, శ్రీనివాస్, మైనార్టీ మోర్చా షేక్ బాజీ, ఓబీసీ మోర్చా మహిళా వైస్ ప్రెసిడెంట్ పద్మావతి, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *