Breaking News

ఉచిత ఇసుక అమలులో జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షించండి

-గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
-తక్షణమే జిల్లా స్దాయి కమాండ్ కంట్రోల్ కేంద్రాలు
-పట్టా భూముల నుండి ఇసుక సేకరణకు త్వరలో జిఓ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు ఉచిత ఇసుక పంపిణీ విషయంలో రోజువారీ సమీక్షలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. వర్షాకాలం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటే, తరువాతి కాలంలో ఇసుక లభ్యత పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు ఆదేశాలతో శుక్రవారం జిల్లా కలెక్టర్లతో అమలులో ఉన్న ఉచిత ఇసుక విధానం, Sept 11 తేదీ నుండి రానున్న నూతన విధానంలపై సచివాలయం నుండి వీడియో కాన్సరెన్స్ నిర్వహించారు. గనుల శాఖ సంచాలకులు ప్రవీణ్ కుమర్ ఇబ్రహింపట్నం కమీషనరేట్ నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ రాష్ట్ర స్దాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ తరహాలోనే జిల్లా స్దాయిలో కూడా జిల్లా స్దాయి కేంద్రాలను తక్షణమే ఏర్పాటు చేయాలని మీనా అదేశించారు.

కలెక్టర్లు ఎటువంటి రాజకీయ వత్తిడులకు లోనుకావలసిన అవసరం లేదని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారని. పట్టా భూముల నుండి ఇసుక సేకరణకు త్వరలోనే జిఓ ఇవ్వనున్నామని, రవాణ చార్జీలు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఏకీకృత ధర అమలులో ఉండేలా ప్రయత్నిస్తున్నామన్నారు. అన్ లైన్ విధానంలో ఇసుక బుకింగ్ ప్రక్రియ ద్వారా ఎవరికి వారు తమ ఇంటి నుండే బుక్ చేసుకుని, జిపిఎస్ విదానంలో తమ వాహనం లోకేషన్ ను కూడా తెలుసుకోవచ్చన్నారు. అన్ లైన్ విధానం పట్ల అవగాహన లేని గ్రామప్రాంతాల వారి కోసం సచివాలయంలో శిక్షణ పొందిన ఉద్యోగి అందుబాటులో ఉంటారన్నారు. జిల్లా స్దాయిలో కలెక్టర్లు ఇసుక లభ్యత, ధరలపై నిత్యం మీడియాకు బులెటిన్ విడుదల చేయాలని మీనా అదేశించారు. జిల్లా స్దాయి వ్యవహరాలకు జాయింట్ కలెక్టర్ ను బాధ్యునిగా చూస్తామన్నారు.

గనుల శాఖ సంచాలకులు, ఎపిఎండిసి ఎండి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ త్వరలో అందుబాటులోకి రానున్న శాండ్ పోర్టల్ విభిన్న అంశాలకు మార్గనిర్దేశకత్వం వహిస్తుందన్నారు. సమస్త సమాచారాన్ని దానిలో అందుబాటులో ఉంచుతామన్నారు. రవాణా వాహనాల ఎంపానల్ మెంట్ ను వేగంగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రతి రోజు ఇసుక పరిస్దితిపై సమీక్ష చేస్తున్నారని, సిఎం అకాంక్షల మేరకు పనిచేయవలసి ఉందన్నారు. వంద శాతం వినియోగదారులు ఇసుక రవాణా విషయంలో తమ సంతృప్తిని వ్యక్తం చేయటమే ద్యేయంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వ్యవస్దలకు భిన్నంగా దర్డ్ పార్టీ ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటున్నామన్నారు. వీడియో కాన్సరెన్స్ లో అయా జిల్లాల కలెక్టర్లు, గనుల శాఖ రాష్ట్ర స్దాయి అధికారులు, ఎడిలు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *