Breaking News

పరీక్ష కేంద్రాల ఏర్పాట్లను తనిఖీ

-యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడెమీ & నావల్ అకాడెమీ మరియు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2024 పరీక్ష కేంద్రాల ఏర్పాట్లను అబ్జర్వర్ తో కలిసి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబర్ 1 వ తేదీన నిర్వహించనున్న యుపిఎస్సి నేషనల్ డిఫెన్స్ అకాడమి & నావెల్ అకాడమి పరీక్ష (II) కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష (II) 2024 పరీక్షా కేంద్రాలలోని ఏర్పాట్లను అబ్జర్వర్ బ్రజిలాల్ మీనా, అడిషనల్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్సెస్ తో కలిసి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1 వ తేదీన యుపిఎస్సి ఆద్వర్యంలో జరగనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమి & నావెల్ అకాడమి (II) 2024 పరీక్షలు గణితం పేపర్ ఉదయం 10గం.ల నుండి మధ్యాహ్నం 12.30 గం.ల వరకు మధ్యాహ్నం సెషన్ జనరల్ ఎబిలిటీ పేపర్ 2 గం. నుండి సాయంత్రం 4.30 గం.ల వరకు ఉంటుందని తెలిపారు. అలాగే కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ (II) 2024 పరీక్షలకు సంబంధించి ఇంగ్లీష్ పేపర్ ఉదయం 9గం.ల నుండి 11 గం.ల వరకు, జనరల్ నాలెడ్జ్ పేపర్ మధ్యాహ్నం 12 నుండి 2 గం.ల వరకు ఉంటుందని, ఎలిమెంటరీ గణితం మధ్యాహ్నం 3 గం. నుండి సాయంత్రం 5 గం.ల వరకు ఉంటుందని తెలిపారు.

తిరుపతిలో మూడు పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్నారని, 821 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ పరీక్షలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు గదులు, త్రాగు నీరు, లైటింగ్ తదితర వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమతి లేదని తెలిపారు.

పరీక్షా కేంద్రాల వివరాలు:
1) 50005 శ్రీ పద్మావతి గర్ల్స్ హై స్కూల్, వెస్ట్ చర్చ్ రోడ్డు, బాలాజీ కాలనీ తిరుపతి. (కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష (II) 2024 కేంద్రం)

2) 50001 శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కాలేజ్ (వింగ్ – A), తిరుపతి (నేషనల్ డిఫెన్స్ అకాడమి & నావెల్ అకాడమి పరీక్ష (II) 2024 కేంద్రం)
2) 50002 శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కాలేజ్ (వింగ్ -B ), తిరుపతి (నేషనల్ డిఫెన్స్ అకాడమి & నావెల్ అకాడమి పరీక్ష (II) 2024 కేంద్రం)

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కో ఆర్డినేటర్ సతీష్, లోకల్ ఇన్స్పెక్టింగ్ అధికారులు తహశీల్దార్ భాగ్య లక్ష్మి, వెన్యూ ఇంఛార్జి లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *