Breaking News

సహేతుక కారణాలు లేని మాతా శిశు మరణాలకు భాధ్యత వైద్యాధికారులదే…

-మాతా శిశు మరణాలలో లోపాలు గుర్తిస్తే సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకుంటాం..
-ప్రాణాపాయ పరిస్థితి వరకు ఉపేక్షించి జిజిహెచ్‌కు పంపడం సరికాదు.
-ప్రభుత్వ వైద్యులకు జవాబుదారితనం ఉండాలి..
-జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సహేతుక కారణాలు లేని మాతా శిశు మరణాలకు వైద్యాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని మరణాలలో వైద్యుల లోపం గుర్తిస్తే చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని మాతా శిశు ఆరోగ్యం ప్రాణాపాయ పరిస్థితి వరకు తీసుకువచ్చి చివరి దశలో ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి పంపడం సరికాదని జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన వైద్యాధికారులను సూచించారు.కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఈ ఏడాది జూన్‌ నెలలో ఆనారోగ్య కారణాలతో సంభవించిన మాతా శిశు మరణాలపై కలెక్టర్‌ డా. జి. సృజన నిశితంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మాతా శిశు మరణాలపై తు.తు. మంత్రంగా సమీక్షలు నిర్వహించడం నిష్‌ ప్రయోజనమన్నారు. మరణాలకు గల కారణాలపై ప్రతి ఒక్కరు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళ గర్భం దాల్చిన నాటి నుండి బిడ్డ పుట్టి ఎదిగే వరకు అనుక్షణం కంటికి రెప్పల కాచి వారు ఆనారోగ్యపాలు పాడకుండా చూసేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికి మరణాలు సంభవించడం బాధకరమన్నారు. మరణాలకు గల కారణాలను సమీక్షిస్తే ఎవరికివారు తమ తప్పేమిలేదని అంతా బాగానే చూసామాని చెబుతున్నారని మరణం కర్మ సిద్దాతాం అన్నచందాన్న ఉందని ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మాతా శిశు మరణాలకు కారణం ఒకరిపై ఒక్కరు చెప్పడం భవ్యం కాదన్నారు. అంతా బాగున్నప్పడు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి. అనే విషయం నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. నాయ్యం జరగనప్పుడు సమీక్షలకు అర్థం ఉండదన్నారు. జూన్‌ మాసంలో ముగ్గురు తల్లులు ఒక శిశువు మరణించడం జరిగిందన్నారు. మరణించిన వారిలో వాసంతికి సంబంధించి 4 నెలలు గడిచినప్పటికి పోస్ట్‌మార్టం నివేదిక ఇప్పటికి ఇవ్వలేదని ఈ కేసుపై సమీక్ష ఎలా నిర్వహించాలో చెప్పాలన్నారు. ఇక నుండి ప్రతి కేసుపై పూర్తి సమాచారంతో సమీక్షకు హాజరుకావాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. వైద్యం చేయడంలో వచ్చే పేరు ప్రఖ్యాతలు ఒక మరణంతో దిగజారిపోతాయని గుర్తించుకోవాలన్నారు. వైద్యాధికారులు సమీష్టి భాధ్యతతో జవాబుదారితనంతో భాధ్యతలు నిర్వర్తించాలన్నారు. నిరుపేదలైన కుటుంబాలకు చెందిన తల్లులు, శిశువులు ఉండడం బాధాకరమన్నారు. గర్భిణీ దాల్చిన వెంటనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి వైద్య పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించి లోపాలను నివారించాలన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే భావన ప్రజల్లో కలగరాదన్నారు. మాతా శిశు మరణాలు పునరావృతం కాకూడదని, వైద్యుల నిర్లక్ష్యంతో మరణాలు సంభవించినట్లు గుర్తిస్తే సంబంధిత వైద్యాధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడేది లేదని కలెక్టర్‌ డా.జి. సృజన తెలిపారు.

సమావేశంలో గత జూన్‌ మాసంలో విజయవాడ రూరల్‌ మండలం కె తాడేపల్లి చెందిన తుమ్మల సంధ్యరాణి, విజయవాడ అర్భన్‌ పరిధిలోని శాంతి నగర్‌ చెందిన యం. వాసంతి, జగ్గయ్యపేటకు మండలం గౌరవరంకి చెందిన బి. శ్రీదేవి, గంపలగూడెం మండలం తోటమూలకు చెందిన జి.పార్వతి కూమార్తె నిషితల మరణాలపై జిల్లా కెలెక్టర్‌ సృజన సమీక్ష నిర్వహించారు.

సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. యం. సుహాసిని, జిజిహెచ్‌ వైద్యులు డా.ఆర్‌. సౌజన్య, డా. సబిత, డా. మదీన అహ్మద్‌, సిద్ధార్థా మెడికల్‌ కళాశాల వైద్యురాలు డా. ఎన్‌ సుమతి, డిస్ట్రిక్‌ ఇమ్యూనైజేషన్‌ ఆఫీసర్‌ డా. అమృత, డిప్యూటి డియం అండ్‌ హెచ్‌వో డా.జె హిందుమతి, టిబియంవో డా. పద్మావతి, ఫాగ్జి ప్రతినిధి డా. ప్రభాదేవి, పిహెచ్‌సి వైద్యులు డా. అనిల్‌ కుమార్‌, షేక్‌ ఖాజా ఇనయ తుల్లా, డా. పి.బార్గవి, ఐసిడిఎస్‌ సిడిపివో జి. మంగమ్మ సూపర్వైజర్లు, ఎన్‌యంలు, పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *