Breaking News

లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్న అధికారులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో, ప్రమాదం పొంచి ఉన్న ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలించారు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు. 15, 16, 17, 18, డివిజన్ మరియు కొండ ప్రాంత ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వాళ్ళని వెంటనే పునరావస కేంద్రాలకు అధికారులు తరలించి వారికి కావాల్సిన త్రాగునీటి భోజన సదుపాయాలు కల్పించారు. వర్షం నీటిలో చిక్కుకుపోయిన ప్రజలందరూ పునరావస కేంద్రాల్లో తరలిరావాలని, ప్రాణహాని లేని ప్రదేశాల్లో నివసిస్తున్న వారు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్న వారికి ఇంటి వద్దనే త్రాగునీటి, భోజన సదుపాయం కల్పిస్తారని కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కంట్రోల్ రూమ్ సదుపాయం కల్పించారని ఇందులో సిబ్బంది 24 గంటలు పని చేస్తారని, నగర పౌరులకు ఎటువంటి సమస్య అయినా ఈ ఫోన్ నెంబర్లకు 0866-2424172
0866-2427485 ఫోన్ చేసి తెలుపవచ్చు అని, 8181960909 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా కూడా సమస్యను తెలుపవచ్చని, కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *