Breaking News

రైతులకు పూర్తి స్థాయి భరోసా కల్పించండి

-బుడితి రాజశేఖర్ ఐఏఎస్ , ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ( వ్య & స)
వ్యవసాయ అధికారులు జిల్లా పాలన యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రైతులకు క్షేత్ర స్థాయిలో అందుబాటులో వుండండి .
-S.డిల్లీ రావు , ఐఏఎస్,వ్యవసాయ సంచాలకులు ,ఆంధ్రప్రదేశ్

మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
ది. 01/09/2024 ఆదివారం న రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు డిల్లీ రావు , ఐఏఎస్ వారు ,రాష్ట్రములోని అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు మరియు అనుబంధ శాఖల అధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు .తుఫాను రాష్ట్ర తీరం దాటి ,వర్షాలు తగ్గుముఖం పట్టిన దృష్ట్యా ,యంత్రాంగం పంటలను కాపాడుకుని ,రైతులకు భరోసాను కల్పించే తక్షణ చర్యలు గురుంచి చర్చించారు .
ఉత్తర కోస్తా మరియు రాయలసీమ జిల్లాలోని అధికారులు మాట్లాడుతూ ఈ వర్షాలు ఈ ప్రాంత పంటలకు అనుకూలముగా వుండి, మేలు చేసేవిగా వున్నాయని తెలిపారు. వీటిపై డిల్లీ రావు స్పందిస్తూ ఈ వర్షాలను రాయలసీమ & ఉత్తర కోస్తా అధికారులు అవకాశముగా తీసుకుని రైతులకు మేలైన పంటల ,ఎరువుల యాజమాన్య పద్ధతులను అనుసరించే విదముగా ప్రచారం చేయాలని తెలిపారు.
పంటలు ఎక్కువుగా ముంపునకు గురిఅయిన కృష్ణా నది బేసిన్ పరివాహక జిల్లాలు ఐన ఎన్టీఆర్ ,కృష్ణ ,గుంటూరు ,బాపట్ల ,పల్నాడు మరియు ఏలూరు జిల్లాల వ్యవసాయ అధికారులతో మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ముంపు బారిన పొలాలను గుర్తించడం , డ్రెయన్ల నుండి నీరు బయటకు పోని ప్రాంతాలను గుర్తించి ,స్థానిక జిల్లా యంత్రాంగంతో ,నీటి పారుదల అధికారులతో సంప్రదిస్తూ సమన్వయం చేసుకుంటూ ముంపు ప్రాంతాల పంటల నుండి నీళ్ళను బయటకు వెళ్లగొట్టే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.
తెలంగాణ ప్రాంతం నుండి దిగువ పల్లపు ప్రాంతానికి పారుతున్న వర్షపు నీటి మూలముగా ఎన్టీఆర్ జిల్లాలోని మున్నేరు, కట్టలేరు ,బుడమేరు లలో నీరు పొంగి ప్రవహిస్తూ పొలాలను ముంపునకు గురవుతున్నాయి కాబట్టి అధికారులు అప్రమత్తంగా వుండాలని తెలియ చేసారు.
వరి ,పత్తి ,మొక్కజొన్న కంది పంటల వారీగా విడుదల చేసిన శాస్త్రీయ సూచనలను వివిధ మాధ్యమాల ద్వారా రైతులకు తెలియచేసి పంటలను కాపాడలన్నారు.
బుడితి రాజశేఖర్ ఐఏఎస్ , ప్రత్యేక ముఖ్యకార్యదర్శి మాట్లాడుతూ ముంపుబారిన పొలాలను అంచనా వేయటానికి సాంకేతికతను ఉపయోగించి
డ్రోన్ల మరియు శాటిలైట్ ద్వారా నష్టపు అంచనా ఏ మేరకు చేయవచ్చో రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ వారితో చర్చoచమని యూనివర్సిటీ పరిశోధన సంచాలకులు డాక్టర్ సత్యనారాయణ కు తెలియచేశారు .
డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రములో ఖరీఫ్ సాగులో వున్న వరి రకాలు పూర్తిగా ముంపు బారిన పడిన కూడా, నీరు బయటకు పోయిన తరువాత ,తిరిగి పూర్తి స్థాయిలో కోలుకునే శక్తి వాటికి వున్నదని తెలుపుతూ బీపీటీ 5204 సాంబమసూరి రకం 3 రోజుల వరకు ,యం. టీ. యు 1318 రకం 5 రోజుల వరకు & యం టీ యు 1061 రకం 7 రోజుల వరకు పూర్తిగా ముంపు బారిన పడినా కూడా నకు వరి పంటకు ఏ విధమైన ప్రమాదం లేదని తెలియ చేస్తూ ఆవిధమైన భరోసా రైతులకు కల్పించాలన్నారు.
S.డిల్లీ రావు కాన్ఫరెన్స్ ను ముగిస్తూ ,రేపు అనగా సోమవారం నాడు వ్యవసాయ శాఖ మంత్రి ముంపు బారిన పడిన గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి ప్రాంతాలను సందర్శిస్తారని తెలియచేసారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *