Breaking News

రక్తదానం వలన  ప్రాణాపాయ స్థితిలో ఉన్న  వారికి పునర్జన్మనిస్తుంది

-మంత్రి కందరు దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
రక్తదానం చేయటం వలన ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మను ఇచ్చినవారవుతామని, రక్తదానం దాతృత్వంతో కూడిన మంచి సేవా కార్యక్రమమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం నిడదవోలు సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు, వైద్యులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, మరొకరి జీవితంలో వెలుగునిస్తుందన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతోపాటు ప్రమాదకర పరిస్థితుల్లో మరొకరికి ప్రాణదానం చేసినవారవుతారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చిన డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన పురస్కరించుకొని నియోజకవర్గంలోని పలుచోట్ల రక్తదాన కార్యక్రమాలు, దివ్యాంగులకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నమన్నారు.

ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం  వేలువెన్ను, పెరవలి మండలం కాకరపర్రు ప్రభుత్వ పాఠశాలలో, నిడదవోలు పట్టణం గణేష్ చౌక్ నందు ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు, దివ్యాంగులకు బట్టల పంపిణీ వేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పెరవలి   గ్రామం, నిడదవోలు పట్టణంలో మెడికల్ క్యాంపును ప్రారంభిం ప్రారంభించుకున్నామని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా  మొక్కలు నాటే  కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని మంత్రి కందుల దుర్గేష్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను మంత్రి దుర్గేష్ అందజేశారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *