Breaking News

జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాబ్ మేళా ప్రారంభోత్సవంకు-ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ప్రభావతి, పిడి, డి ఆర్ డి ఏ మరియు మరో అతిథిగా రాధమ్మ, పిడి, మెప్మా తిరుపతి జిల్లా. ఈ కార్యక్రమానికి అధ్యక్షలుగా డి ఎస్ డి ఓ , ఏపీ ఎస్ ఎస్ డి తిరుపతి, వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సిడాప్ మరియు డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో 03-09-2024 అనగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి తిరుపతిలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(NAC Training Center) నందు జాబ్ మేళా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, ప్రభావతి, పిడి డిఆర్డిఏ, మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ,యువకులు ఏపీ ఎస్ ఎస్ డి సి వారి ద్వారా నిర్వహించే ఇలాంటి జాబ్ మేళాలో పాల్గొని అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా, సాంఘికంగా, రాణించాలని అంతేకాకుండా జీతం గురించి ఆలోచించకుండా ఉపాధి గురించి ఆలోచించి, కష్టపడి పనిచేసి రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో మరో అతిధిగా, రాధమ్మ, పిడి ,మెప్మా వారు మాట్లాడుతూ, ఈ పోటీ ప్రపంచంలో రాణించాలంటే యువతకు ముఖ్యంగా తెలివితేటలు, స్కిల్స్ తో, పాటు, మంచి దృక్పథం, ఆత్మస్థైర్యం,పట్టుదల, శక్తి సామర్థ్యాలు ఉంటేనే ఉద్యోగంలో రాణించి, పోటీ తత్వాన్ని తట్టుకొని వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయంగా ఉద్యోగంలో రాణించగలరని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ జాబ్ మేళాకు వివిధ రంగాలకు చెందిన 7 బహుళ జాతీయ కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులు హాజరయ్యి వాళ్ళ కంపెనీ యొక్క విధి విధానాలు గురించి వచ్చినటువంటి యువతకి తెలియజేశారు, 220 ఉద్యోగాల కొరకు హాజరవ్వడం జరిగినది.

ఇందులో భాగంగా ఈరోజు జరిగిన జాబ్ మేళాకు 157 మంది యువతీ యువకుల వివిధ కంపెనీలలో ఇంటర్వ్యూలకు హాజరవుగా 94 మంది యువతీ యువకులు వివిధ కంపెనీలలో ఉద్యోగ అర్హత పొందడం జరిగినది. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీ హెచ్ఆర్ ప్రతినిధులతో పాటు, ఆర్.లోకనాథం, డిఎస్డిఓ, ఏపీ ఎస్ఎస్డిసి, గోపికృష్ణ, జిల్లా ఉపాధి కల్పన అధికారి, .సతీష్, ఏడి నాయక్, చక్రి నాయక్, మేనేజర్, సెట్విన్, సుదర్శన్, ఏపీఎం, సీడాప్, మరియు నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది, గణేషు,మురళి పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *