Breaking News

వరద బాధితులకు ఆపన్నహస్తం అందించిన పశ్చిమగోదావరి జిల్లా

-కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవతో కదిలిన వ్యధాన్యులు
-1,98,960 ఆహార పొట్లాలు, 70 వేల వాటర్ ప్యాకెట్లు, 1.15 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు

భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ప్రాంతవాసులు అకాల వరదలలో చిక్కుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా నుండి వారికి పెద్ద ఎత్తున ఆపన్న హస్తం అందింది. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవతో దాతలు తమదైన శైలిలో ముందడుగు వేసారు. కలెక్టర్ కోరిందే తడవుగా పలువురు ముందుకు వచ్చి తమ వ్యధాన్యతను చాటుకున్నారు. వరద సహాయ చర్యల్లో భాగంగా జిల్లా నుండి 1,98,960 ఆహార పొట్లాలు, 70 వేల వాటర్ ప్యాకెట్లు, ఐదు వేల అర లీటర్ నీటి సీసాలు, 1,15,100 బిస్కెట్ ప్యాకెట్స్, 14 వేల రొట్టెలు, 22 వేల రస్కుల ప్యాకెట్స్ విజయవాడ చేరాయి. వివిధ స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారవేత్తలు, సంఘాలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్ధలు, ఆహార ప్రాసెసింగ్ కంపెనీలు సహకారంతో గత రెండు రోజులుగా వీటిని విజయవాడకు ప్రత్యేక వాహనాల ద్వారా పంపామని ఈ సందర్భంగా చదలవాడ నాగరాణి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపన్న హస్తం అందించడానికి ముందుకు వచ్చిన జిల్లా వాసులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

తొలిరోజు (సోమవారం) 85,500 ఆహార పొట్లాలు, 45 వేలు వాటర్ ప్యాకెట్లు, 5 వేల అర లీటర్ వాటర్ బాటిల్స్, 1,14,500 బిస్కెట్ ప్యాకెట్లను భారతీయ విద్యా భవన్, గోదావరి విద్య వికాస్, చైతన్య సొసైటీ, నరసాపురం స్వర్ణాంధ్ర కాలేజ్, తాడేపల్లిగూడెం రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఉద్యానవన యూనివర్సిటీ, నిట్ యూనివర్సిటీ, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, శశి ఇంజనీరింగ్ కాలేజ్, భీమవరం విష్ణు కాలేజిల సహాయ సహకారాలతో సమకూర్చామన్నారు. మంగళవారం 1.15 లక్షల ఆహార పొట్లాలు తయారు చేయించి విజయవాడ పంపగా, వీటితోపాటు రస్క్ లు 22 వేలు, బన్స్ 14 వేలు, 600 బిస్కెట్ ప్యాకెట్ లు, 25 వేలు వాటర్ ప్యాకెట్స్ పంపడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో వెస్ట్ గోదావరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, భీమవరం ప్రాన్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్, చైతన్య గోదావరి విద్యా వికాసం, తౌడు కొట్టు సుబ్బరాజు, తిరుమల కాలేజీ, సంధ్యా మెరైన్స్, దేవాదాయ శాఖ, ఎఫ్ ఎఫ్ టి ఫుడ్ ఫ్యాక్ట్ కంపెనీ, తాడేపల్లిగూడెం శశి కాలేజ్ గ్రూపు, భీమవరం విష్ణు కాలేజీ, తాడేపల్లిగూడెం ఎన్ కే గ్రూప్ నంద్యాల కృష్ణమూర్తి, ఆకివీడు చాంబర్ ఆఫ్ కామర్స్, హాట్ లైన్స్ బాబు, కాస్మోకల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం, తాడేపల్లిగూడెం ఎన్ కే మెరైన్స్, తణుకు ఆంధ్ర షుగర్స్, ఇరగవరం వన్ బెర్రీ ఫార్మా, ప్లట్స్ ఇండస్ట్రీస్, లయన్ కృష్ణంరాజు, తౌడు కొట్టు సుబ్బారావు తదితరులు ఆహార పొట్లాలను అందజేయడంలో తమ ఉదారత చాటారని నాగరాణి తెలిపారు. ముఖ్యమంత్రి పిలుపుకు స్పందించి వరద బాధితులకు అదుకోవటంలో జిల్లా వాసులు ముందుండటం ఆనందాన్ని కలిగిస్తుందని, సిఎం ఆదేశాల మేరకు తమ వంతు సాయం చేయటానికి ఎప్పడు సిద్దంగా ఉంటామని జిల్లా ప్రజలు తెలిపారని నాగరాణి వివరించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *