Breaking News

ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుంధి…

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. మంత్రి బుధవారం తాడిగడప మున్సిపాలిటీలో యనమలకుదురు, పెనమలూరు మండలం కరకట్టపై పెదపులిపాక శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించి మంత్రి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ప్రకాశం బ్యారేజీ నిర్మించాక ఎన్నడూ ఊహించని విధంగా కృష్ణానదికి వరద రావడం, వేలాది మంది నిరాశ్రయులవడం జరిగిందని, ఇదొక ప్రకృతి వైపరీత్యమని, దీనిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు ప్రణాళికతో సర్వశక్తులు వడ్డారని అన్నారు. ఆధునిక సాంకేతిక విధానాలను వినియోగించి, ముఖ్యమంత్రి స్వయంగా బుల్డోజర్స్ పై వరద ప్రాంతాల్లో పర్యటించి, ఒక యజ్ఞం లాగా పర్యవేక్షిస్తున్నారని, 200 బోట్లు, 7 హెలికాప్టర్లు, 40 ద్రోన్ లు వినియోగించి ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నారని తెలిపారు.

బాధితులు తాము సర్వం కోల్పోయామని, ఇంతటి వరద ఎన్నడూ చూడలేదని ఆదుకోవాలని కోరారు. విద్యార్థుల సర్టిఫికెట్లు నడిచి పాడయ్యాయని, కొంతమంది తమ ఇంటి డాక్యుమెంట్లు కూడా తడిసిపాడయ్యాయని మంత్రి దృష్టికి తెచ్చారు. వర్షాలు, వరద తగ్గగానే జరిగిన నష్టం అంచనా వేసి, బాధితులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు., ముంపు ప్రాంతాల్లో నీటిని తోడించి, విద్యుత్ పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నట్లు, పాడైన కరెంటు మీటర్లు స్థానంలో ఉచితంగా కొత్త మీటర్లు అందించడం, పాడైన గృహాలకు మరమ్మత్తులు కూడా చేయించుటకు కృషి చేస్తామన్నారు.

ఈరోజు వరద ప్రాంతాల్లో బియ్యం, కందిపప్పు, నూనె వంటి నిత్యావసరాలు బాధితులకు అందించడం జరుగుతుందన్నారు. మానవతా దృక్పథంతో మానవతావాదులు, ఎన్జీవోలు ముందుకు వచ్చి బాధితులకు ఆహారం తాగునీరు సరఫరా చేస్తున్నారని వారి కృషి అభినందనీయమన్నారు.

పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ మాట్లాడుతూ వరద ఉధృతి ముందుగానే ఊహించి లోతట్టు ప్రాంతాల వారిని హెచ్చరించడం జరిగిందన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడం జరుగుతుందన్నారు. గృహాలు మునిగి మీటర్లు పాడయ్యాయని, సర్టిఫికెట్లు తడిచి పాడైన విద్యార్థులకు 15 రోజుల్లో సర్టిఫికెట్లు పొందుటకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కొంతమంది ఇంటి పత్రాలు పాడయ్యాయని తెలుపగా, వాటి నకళ్ళు తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ అధికారులకు సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ముంపు ప్రాంతాల్లో బాధితులకు ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యం, పంచదార కందిపప్పు అందజేయడం జరుగుతుందన్నారు. స్థానిక నాయకులు మంత్రి వెంట ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *