విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ముంపు ప్రాంతాలలో చేపడుతున్న సహాయ చర్యల కోసం తానే స్వయంగా రంగంలోకి దిగారు రెవిన్యూ శాఖ (విపత్తుల నిర్వహణ, భూపరిపాలన, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా. వర్ష తీవ్రత ప్రారంభమైన శనివారం మొదలు, విపత్తుల నిర్వహణ సంస్ధ నుండి పరిస్ధితిని సమీక్షించటం, లేకుంటే నేరుగా వరద పీడిత ప్రాంతాలలో రంగంలోకి దిగటమో చేస్తూ వచ్చారు. సహాయ చర్యల కోసం కేటాయించిన సిబ్బందితో పాటు, తన వ్యక్తిగత సిబ్బంది అండగా, బుధవారం కూడా మోకాలి లోతు నీటిలో రోడ్డుపై తిరుగుతూ మంచినీటి సీసాలు, ఆహార పోట్లాలు పంపిణీ చేసారు. మారుమూల సందులలోకి కూడా వెళ్లి వాటిని పంపిణీ చేస్తూ, వారి ఆవేదన మేరకు ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేస్తుందని భరోసా ఇస్తున్నారు. నగరంలోని వార్డు 61 ప్రాంతానికి సిసోడియా ప్రత్యేక అధికారిగా ఉండగా, ట్రాక్టర్ పై తిరుగుతూ ప్రజలకు నమ్మకం కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ప్రతి నిమిషం పరిస్ధితిని అంచనా వేస్తూ తదనుగుణ అదేశాలు జారీ చేస్తున్నారని, ఎవ్వరూ భయపడవలసిన పనిలేదని ఈ సందర్భంగా సిసోడియా పేర్కొన్నారు. నీటి మట్టం క్రమేణా తగ్గుతుందని, సహాయ చర్యలు మరింత వేగం పుంజు కుంటాయని తెలిపారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …