Breaking News

ముగిసిన సైమా బ్యూటీ ఎక్స్ పో

-ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంతర్జాతీయ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఓజస్ రజిని

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని స్థానిక ఎస్ఎస్ కన్వెన్షన్ లో సైమా బ్యూటీ ఎక్స్ పో ముగింపు సంబరాలు బుధవారం ముగిసాయి.ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సెలబ్రిటీ మేకప్ సినీ ఆర్టిస్ట్, అంతర్జాతీయ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ వోజాస్ రజిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైమా బ్యూటీ ఎక్స్ పో కార్యక్రమానికి విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ఎస్ బి ఎం ఎస్ కో ఫౌండర్, డైరెక్టర్ బి రాఘవీరెడ్డి, సైమా ఫౌండర్ మాట్లాడుతూ సైమా బ్యూటీ ఎక్స్ పో విజయవాడకు జరుగు కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. నవంబర్ నెలలో విజయవాడలో మళ్లీ బ్యూటీ ఎక్స్ ఫోన్ నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ ఎక్స్పోలో బ్రైడ్స్ మెహందీ, హెయిర్ కట్, సెల్ఫ్ మేకప్ కోర్స్, బేసిక్ అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ బ్రైడల్ మేకప్, ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్, సారీ డ్రాపింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్, ఫ్లవర్ మేకింగ్, బేసిక్, అడ్వాన్స్ బ్యూటీ పార్లర్ కోర్స్, కంప్లీట్ హైడ్రా ఫేషియల్ కోర్స్, బేసిక్ అడ్వాన్స్డ్ హెయిర్ కట్స్, నెయిల్ ఎక్స్టెన్షన్ క్లాసెస్ సంబంధించిన వివరాలు అందరికీ తెలియజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ కే శ్రీనివాస్( మాలియో కాస్మెటిక్స్), బి శ్రీనివాస్ ( బీ ఈ బీ కాస్మెటిక్స్), ఎం శ్రీనివాస్( ఫెయిర్ టచ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్), విల్సన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *