Breaking News

తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.10 లక్షలు చొప్పున మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ విరాళం అందచేశారు. ఢిల్లీ లో రెండు రాష్ట్రాల రెసిడెంట్‌ కమిషనర్లకు ఈ మేరకు బుధవారం చెక్కులు అందచేసారు.కష్ట కాలంలో మనకు చేతనైనంత సాయం చేయాలని ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపు నిచ్చారు. సమాజం కోసం అందరూ ముందుకొచ్చి ఆదుకోవాలన్నారు. ఇద్దరు సీఎంల నిర్విరామ కృషికి మద్దతుగా నిలవ వలసిన అవసరం ఉందని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. కష్టాల్లో ఉన్న తెలుగు ప్రజలను ఆదుకోవాలని ప్రతి ఒక్కరినీ చేతులు జోడించి ప్రార్థిస్తున్నానన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *