Breaking News

అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా, డివిజన్ మండల స్థాయి అధికారులతో జిల్లాలో విస్తారంగా కురుస్తున్న అధిక వర్షపాతం, గోదావరి నది చేరుతున్న వరదా నీరు నేపధ్యంలో ముందస్తు జాగ్రత్తలు పై ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, డి ఆర్వో జి నరసింహులు, కె ఆర్ ఆర్ సి ఎస్ డీ సి ఆర్ కృష్ణ నాయక్, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.

-అధిక వర్షాలు నేపథ్యం లో ముందస్తు కార్యాచరణ తో సిద్ధంగా ఉండాలి
– ఉదయం నుంచి రాజమండ్రి రూరల్, అర్బన్, కడియం , పెరవలి , తాళ్లపూడి మండలాల్లో అధిక వర్షపాతం నమోదు
– లోతట్టు ప్రాంతాలలో తరలింపు చేపట్టాలి
– పునరావాస కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి
-కమాండ్ కంట్రోల్ రూం లలో సిబ్బంది అందరూ విధుల్లో రిపోర్టు చెయ్యాలి
– కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ 8977935609
– ఆక్రమణల వలన ముంపు వాటిల్లితే సంబంధిత అధికారిని బాధ్యులను చేస్తా
– కలెక్టర్ పి. ప్రశాంతి

వర్షాభావ పరిస్థితుల్లో చేపట్టవలసిన కార్యక్రమాలు విషయములో క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పునరావాస కేంద్రాలలో తగిన వసతులతో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గోదావరి పరివాహక పై ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు, ధవళేశ్వరం వద్ద సాయంత్రానికి 9 లక్షల క్యూసెక్కుల వరదనీరు నీరు చేరే అవకాశం దృష్ట్యా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అంతకు ముందుగానే లోతట్టు ప్రాంతాలలోని, ముంపుకు గురి అయ్యే లంక గ్రామాల్లో నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించేలా యంత్రాంగాన్ని సన్నద్ధం కావాలని సూచించారు. బ్రిడ్జి లంక, ములకల్లంక తదితర ప్రాంతాల్లో పరిస్థితి ని సమీక్షించాలన్నారు. రాజమండ్రి ఆర్డీవో, కొవ్వూరు సబ్ కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మొత్తం నోడల్ అధికారిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, అనుబంధ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. సూరంపాలెం, కొవ్వాడ, ఎర్రకాలువ, ధవళేశ్వరం బ్యారేజ్ ప్రాంతాల్లో గండ్లు పడే అవకాశం ఉన్న , ముంపుకు గురి అవకాశం వున్న లోతట్టు ప్రాంతాలలో ముందస్తు రక్షణా చర్యలను తీసుకోవాలని తెలిపారు. ఆక్రమణల వలన ముంపు వాటిల్లితే సంబంధిత అధికారిని బాధ్యులను చేస్తామని కలెక్టరు హెచ్చరించారు. పునరావాస, ముంపు ప్రాంతాలలో నిత్యావసర సరుకుల పంపిణీ ప్రణాళికలో భాగంగా ముందస్తు చర్యలలో కోసం ఒక నెలకు సరిపడే నిత్యావసర వస్తువుల సిద్దం చేసుకోవడం జరిగిందనీ తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రంగం సిద్ధంగా ఉండాలన్నారు భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక జారీ చేసిన దృష్ట్యా , ధవళేశ్వరం మొదటి ప్రమాద హెచ్చరిక కంటే ముందుగానే మనం సిద్ధంగా ఉండాలన్నారు. ప్రస్తుతం 4.9 లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతోందని, 5 లక్షల క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. సాయంత్రానికి 9 లక్షల క్యూసెక్కుల చేరే అవకాశం ఉందని ఆ మేరకు దిగువ విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం 8 అడుగులు వద్ద గోదావరీ వరద స్థాయి ఉందని 11.75 అడుగులు చేరిన్స్ తదుపరి మొదటీ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు తెలిపారు. కొవ్వూరు రాజమండ్రి డివిజన్ పరిధిలో బోర్డ్స్ సిద్ధం చేసుకోవాలని లోతట్టు ప్రాంతాల ప్రజలను పురస్ కేంద్రాలు తరలించడానికి సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా నిషేధం అమలు చేయాలన్నారు. అగ్నిమాపక శాఖ, మత్స్య శాఖ అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. వర్షపాతం, అధిక గాలిల వలన కూలిన చెట్లను తక్షణం తొలగించడానికి తగిన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 14 వుడెన్ కట్టర్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. రాజమండ్రి నగరపాలక సంస్థ మత్స్య శాఖ ఆధ్వర్యంలో బోట్లను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, ఫీవర్ సర్వే కూడా సమాంతరంగా నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు. అత్యవసర మందులను సిద్దం చేసినట్లు తెలిపారు. సచివాలయ సిబ్బందికి ఏటువంటి సెలవులు ఇవ్వవద్దని, 24 x 7 అందుబాటులో ఉంచాలన్నారు. క్షేత్రస్థాయిలో చేపట్టే పురావసర కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేయాలన్నారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాలను ముందుగా గుర్తించి అక్కడ తగిన రక్షణ చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే డ్రోన్ సర్వే ద్వారా వనరబుల్ ప్రాంతాలను గుర్తించి , మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన అక్కడ పరిస్థితులను అంచనా వేయాలని మండల స్థాయి అధికారులకు కలెక్టర్ ప్రశాంతి సూచించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *