Breaking News

బిఎల్ఓ ఇంటింటి సర్వే ద్వారా చేపట్టి పారదర్శకమైన, లోపాలు లేని డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరల్ రోల్ తయారు కావాలి…

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఫోటో ఎలక్టోరల్ జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 ను బిఎల్ఓ ఇంటింటి సర్వే ద్వారా చేపట్టి పారదర్శకమైన, లోపాలు లేని డ్రాఫ్ట్ ఫోటో ఎలక్టోరల్ రోల్ తయారు కావాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని అన్ని నియోజక వర్గాల, మండలాల అధికారులు, బిఎల్ఓ లతో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

బిఎల్ఓ లు చేపట్టిన గృహ సందర్శన ద్వారా సర్వే నందు ఓటర్ల జాబితా పరిశీలించి మార్గదర్శకాల మేరకు ఎలక్టరల్ జాబితా/ ఎపిక్ లో గుర్తించిన ఏదైనా లోపాలను సవరించాలని, చిత్ర నాణ్యత మెరుగుపరచడం మరియు పోలింగ్ స్టేషన్ల మరియు సరిహద్దుల ఖారారు తదితర వంటి ప్రాథమిక సవరణ కార్యచరణలు చేపట్టాలని తెలిపారు. ఒక కుటుంబంలోని వారు అందరూ ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో ఉండేలా వారితో మాట్లాడి డూప్లికేషన్ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అబ్సెంటీ ఓటర్, పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరుగా చేర్చుటకు, తొలగింపుకు, షిఫ్టింగ్, చిరునామా మార్పు వంటి వాటి కొరకు సంబంధిత ఫారం మేరకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ అక్టోబర్ నాటికి 18 సం.లు నిండిన వారిని, అలాగే జనవరి2025 నాటికి 18 సం.లు నిండబోతున్న వారిని గుర్తించి వారిని నూతన ఓటరుగా నమోదు కొరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్టోబర్ నెల 19వ తేదీ నుండి 28 అక్టోబర్ వరకు ఫార్మట్ 1 నుండి 8 వరకు 01.01.2025 నాటికి సంబంధించిన డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ తయారు చేయాలని, అలాగే ముసాయిదా ఓటర్ జాబితా 29 అక్టోబర్ 2024 నాటికి లోపాలు లేకుండా ప్రచురించాల్సి ఉంటుందని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఎస్డిసి రామ్ మోహన్, నరసింహులు ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *