Breaking News

వ్యవసాయ అనుబంధ రంగాల్లోనీ 40 మంది డీలర్ల కు ‘దేశీ’ ధ్రువపత్రాల ప్రధానోత్సవం

-ఎస్ మాధవరావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పరిధిలో 8 వ బ్యాచ్ గా 40 మంది వ్యవసాయ అనుబంధ రంగాల్లో డీలర్ల గా వ్యవహరిస్తున్న వారికి “దేశి (DAESI) డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ ఇన్‌పుట్ డీలర్స్ అర్హత ధ్రువపత్రాల ను అందచేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు తెలిపారు. గురువారం స్థానిక స్టేడియం రోడ్డు లోని గంటా గని రాజు కల్యాణ మండపం లో ‘ దేశీ ‘ 48 వారాల శిక్షణ కార్యక్రమం పూర్తి చేసిన తదుపరి ధ్రువపత్రాల ప్రధానోత్సవ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాధవ రావు మాట్లాడుతూ, ఫార్మసీ రంగంలో మెడికల్ షాపులు నిర్వహించే వారు ఏ విధంగా ఫార్మా ధ్రువపత్రం కలిగి ఉంటారో, ఏడి విధంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో డీలర్ల కూడా తప్పనిసరిగా సంబంధిత విద్యా అర్హత కలిగి ఉండాలని లేదా MANAGE 2003 సంవత్సరంలో ప్రవేశ పెట్టిన స్వీయ-ఆర్థిక “ఒక-సంవత్సర డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ ఇన్‌పుట్ డీలర్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని పేర్కొన్నారు. డీలర్లు ఎవరైతే విత్తనములు ఎరువులు, పురుగు మందులు వ్యాపారం చేయుచున్న వారికి డిప్లొమా కోర్సు ని 12 నెలలు పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో అనుభవజ్ఞులైన వ్యవసాయ శాఖలో పనిచేసిన అధికారులు మరియు శాస్త్రజ్లులతో వారానికి ఒకరోజు చొప్పున ( ఆదివారం) మొత్తం 48 వారాలు ట్రైనింగ్ ను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆమేరకు తూర్పు గోదావరి జిల్లాలో నీ 40 మంది డీలర్లు లకి 8 వ బ్యాచ్ గా శిక్షణా కార్యక్రమం నిర్వహించి, ధ్రువపత్రం జారీ చేస్తున్నామన్నారు. ఇందులో అర్హత పొందుట ద్వారా ఎరువు, పురుగు మందులు లైసెన్సు ద్వారా వ్యాపారము చెయుటకు అర్హత కల్పించుట జరుగు చున్నదని పేర్కొన్నారు. ఈ 12 నెలలు శిక్షణ పొందిన డీలర్లు తప్పని సారిగా, రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించుటలో ప్రథాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కి సమన్వయ కర్త , సాంకేతిక నిర్వహణా నిపుణులు గా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ వై. జ్యోతిర్మయి , ఫెసిలిటేటర్ గా డా కె వి సీతారామయ్య వ్యవరించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో ఆత్మ పిడి వై జ్యోతిర్మయి, సహాయ సంచాలకులు (వ్యవసాయ) శ్రీనివాస రెడ్డి, మల్లిఖార్జున రావు, జయ రామ లక్ష్మీ , ఫెసిలిటేటర్ సీత రామయ్య గారు, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ, డీలర్ లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *