Breaking News

‘ఉద్యోగ్ సమాగం’ లో పాల్గొన్న రాష్ట్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖామాత్యులు టి జి భరత్ నేడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఉద్యోగ్ సమాగం’ లో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మాత్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వాణిజ్య సరళీకరణ విధానాల (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) గూర్చి చర్చించారు. జితిన్ ప్రసాద, సహాయ మంత్రి, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ 2016 సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ ‘ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ లో దేశంలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక (బిజినెస్ రిఫాం యాక్షన్ ప్లాన్) లో భాగంగా జిల్లా సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక (డిస్ట్రిక్ రిఫాం యాక్షన్ ప్లాన్) అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ఈ కారణంగా కేంద్రం నుండి ఋణ పరిమితికి మించి (స్థూల రాష్టోత్పత్తిలో రెండు శాతం, అదనంగా) ఋణం పొందడం జరిగిందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రప్రథమంగా, ఆంధ్రప్రదేశ్ 2015లో, వ్యాపార రంగానికి సంబంధించి ఏక గవాక్ష విధానం (సింగిల్ విండో పోర్టల్ & క్లియరెన్స్ మెకానిజం) ప్ర్రారంభించడం జరిగిందని వివరించారు. 14 వివిధ కార్మిక చట్టాలను ఒకే సరళ కార్మిక చట్టంగా చేయగలిగామన్నారు. ఆన్లైన్ వ్యర్థ నిర్వహణ పోర్టల్, ఆన్లైన్ ముడి పదార్థాల కేటాయింపు ప్రారంభించామన్నారు. చలనచిత్రాల షూటింగ్ అనుమతుల వ్యవస్థను సరళీకరించి, అవస్థలు లేకుండా ఐదు రోజుల్లోనే పూర్తి అనుమతులు పొందే విధంగా చేయగలిగామన్నారు.

ముఖ్యమంత్రి పటిష్ట నాయకత్వంలో రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతంగా సాధించడానికి అడుగులు వేస్తోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చిన్న, మధ్య తరహా, భారీ మరియు అతి భారీ స్థాయి పరిశ్రమలన్నింటికీ రాష్ట్రంలో ఎదిగే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. సృజనాత్మక ఆలోచనలకు పెట్టింది పేరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర పారిశ్రామిక మరియు వాణిజ్య విధానాలు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కు మించి “స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్’ వైపు పయనిస్తున్నాయని తెలియజేశారు.

అనంతరం రాష్ట్ర మంత్రి, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజకీయ మరియు భౌగోళిక ప్రాధాన్యంగల కర్నూలు నగరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు గల క్రీడా ప్రాంగ‌ణాన్ని నిర్మించాలని కేంద్ర మంత్రిని కోరారు. క్రీడా ప్రాంగ‌ణం నిర్మాణంతో పాటు అత్యుత్తమమైన తర్పీదునిచ్చే శిక్షకుల నియామకం మరియు క్రీడా నైపుణ్యాల గుర్తింపు మరియు అభివృద్ధికి తోడ్పాటు గూర్చి కేంద్ర మంత్రితో చర్చించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *