-మంత్రులు వంగలపూడి, అనగాని లతో కలిసి పర్యటన
-ట్రాక్టర్ పై ఎక్కి ముంపు ప్రాంతాలు పరిశీలన
-వరద బాధితులకు దుప్పట్లు, పచ్చళ్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ముంపు తగ్గిన ప్రాంతాల్లో పారిశుద్ద్య పనులపై దృష్టి పెట్టాము. నిత్యాసవర సరుకుల పంపిణీ చేయటంతో పాటు, అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా డ్రోన్స్ ద్వారా లిక్వెడ్ బీచ్లింగ్ స్ప్రై చేస్తున్నాము. ప్రజలందరూ కొన్ని రోజుల పాటు కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగాలని ఎంపి కేశినేని శివనాథ్ సూచించారు. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ లతో కలిసి ఆదివారం వరద ముంపు ప్రాంతాలైన కండ్రిక, వాంబే కాలనీల్లో ఎంపి కేశినేని శివనాథ్ వరద బాధితులతో మాట్లాడారు. ముందుగా కండ్రిక ప్రాంతంలో బాధితుల్ని కలుసుకోగా, అక్కడ కొంతమంది బాధితులకి బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. అనంతరం అక్కడ నుంచి పాయకాపురం, పైపుల రోడ్డు మీదుగా వాంబే కాలనీ ట్రాక్టర్ పై వెళ్లటం జరిగింది. ఆ వరద నీటిలో మంత్రి అనగాని ప్రసాద్ ట్రాక్టర్ ను డ్రైవ్ చేయగా చేరో వైపు ఎంపి కేశినేని శివనాథ్, మంత్రి అనిత కూర్చొన్నారు. వాంబే కాలనీలో రెవెన్యూ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్లు, పచ్చళ్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయగా…వాటిని మంత్రులు అనిత, సత్యప్రసాద్ లతో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ బాధితులకి పంపిణీ చేశారు. వరద నీటిలో డ్రైనేజీ వాటర్ కూడా కలవటంతో అక్కడ నివసిస్తున్న ప్రజల బాధలు గమనించిన ఎంపి కేశినేని శివనాథ్ వరద నీరు తగ్గానే డ్రైనేజీ సమస్యకి శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామని, వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ లు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే నగరానికి వరద విపత్తు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎనిమిది రోజులుగా రేయింబవళ్లు నగరాన్ని సాధారాణ స్థితికి తెచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్చూరి ప్రసాద్, టిడిపి మహిళ నాయకురాలు పలగాని భాగ్యలక్ష్మీ, టిడిపి 64వ డివిజన్ అధ్యక్షుడు పరసా అశోక్ బాబు, పార్టీ నాయకులు ధన శేఖర్ తదితరులు పాల్గొన్నారు.