Breaking News

సమగ్ర శిక్షాలో ఉద్యోగాలేవీ భర్తీ చేయలేదు

-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ (NDEAR) ఆధ్వర్యంలో DIKSHA & UNICEF కౌన్సిలింగ్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ పోస్టులకు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను నమ్మవద్దని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు సెంట్రల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, కేజీబీవీ, కేంద్రీయ విద్యాలయాలు, మున్సిపల్ హైస్కూల్, ఇంటర్మీడియేట్ బోర్డులో ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే మోసపూరిత వార్తలను నమ్మి దళారులకు డబ్బులు ఇవ్వడం వంటివి చేయవద్దని నిరుద్యోగులను, తల్లిదండ్రులను కోరారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *