Breaking News

వరద నీరు ఎక్కడ నిల్వ ఉండకుండా చూడండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద నీరును నిలువ ఉండకుండా చూసుకోవాలని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తీసేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం వరద ప్రభావిత ప్రాంతాలైన నందమూరి నగర్, వాంబే కాలనీ, కండ్రిక సెంటర్, సివిఆర్ ఫ్లైఓవర్ తదితర ప్రాంతాలలో కమిషనర్ ధ్యానచంద్ర పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా నందమూరి నగర్ లో పర్యటించి అక్కడ ఉన్న భూగర్భ డ్రైనేజీను, పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన నందమూరి నగర్ లో అక్కడున్న ప్రజలతో మాట్లాడి విజయవాడ నగరపాలక సంస్థ వారు పైప్లైన్ ద్వారా తాగునీటి కులాయికి సరఫరా చేస్తున్న నీటిని కేవలం వాడుటకు మాత్రమే ఉపయోగించాలని, త్రాగుటకు టాంకర్లతో సురక్షితమైన త్రాగు నీటిని సరఫరా చేస్తున్నామని, కేవలం ఆ నీటిని తాగమని ప్రజలను కోరారు. రోడ్డుమీద ఉన్న నీటి నిల్వలను వెంటనే తీసేయాలని, ప్రజలు అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు తరచూ బ్లీచింగ్ పౌడర్ స్ప్రే చేయాలని, ప్రజలను ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని సత్వరమే కల్పించాలని అధికారులను ఆదేశించారు. వరదలో కొట్టుకు వచ్చిన వ్యర్ధాలను తొలగించడానికి విజయవాడ నగరపాలక సంస్థ 465 వాహనాలతో, వరద ప్రభావితమైన ప్రతి డివిజన్లో పారిశుద్ధ్య నిర్వహణ విస్తృతంగా చేస్తుందని అన్నారు.

పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సహకారంతో 184 ట్రాక్టర్లు, 122 టిప్పర్లు, 65 జెసిబి లు, 22 బోబ్క్యాట్ లు,13 డోజర్లు,7 ప్రొసీలైనర్లు, 2 క్రేన్లు, 25 కంపెక్టర్లు, 23 ఎయిర్ టెక్ మెషిన్లతో వరద ప్రభావిత ప్రాంతాలలో వరదనీరు ను తీసి పెడతారని శుభ్రపరుస్తున్న పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఇతర పురపాలక సంస్థ లు నుండి వచ్చిన 6,830 పారిశుద్ధ్య కార్మికులతో, 950 శానిటరీ సూపర్వైజర్లతో, 62 శానిటరీ నోడల్ ఆఫీసర్లతో, 149 పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ, వార్డ్ సచివాలయ స్పెషల్ ఆఫీసర్లతో, 32 వార్డ్ స్పెషల్ ఆఫీసర్లతో, ప్రతి వార్డ్ కీ ఒక ఐఏఎస్ వార్డ్ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో శరవేగంగా పారిశుధ్య నిర్వహణ జరుపుతున్నందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వరద ప్రభావితమైన ప్రతి వార్డ్ లో త్వరితగతి న పారిశుద్ధ్య నిర్వహణను పూర్తి చేసి, ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *