Breaking News

ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ యలమంచి సదాశివరావుకు ప్రతిష్టాత్మక పురస్కారం

– అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ నుంచి గవర్నర్స్ రికగ్నిషన్ అవార్డు
– లక్నోలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా పురస్కార ప్రదానం
– అవార్డు అందుకున్న అనంతరం బెంగళూరులో జరిగిన సదస్సులో కాలి పుండ్లకు ప్రత్యామ్నాయ చికిత్సలపై ప్రసంగించిన డాక్టర్ సదాశివరావు
– అవార్డు లభించిన సందర్భంగా డాక్టర్ యలమంచి సదాశివరావుకు ఆరిజన్ హాస్పిటల్లో ఘన సత్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మధుమేహ వ్యాధి చికిత్సా రంగంలో దశాబ్దాలుగా విశిష్ట సేవలందిస్తున్న ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ డాక్టర్ యలమంచి సదాశివరావుకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇండియా చాప్టర్ వారిచే గవర్నర్స్ రికగ్నిషన్ అవార్డు ప్రదానం చేయబడింది. ఇటీవల లక్నోలో జరిగిన ఏసీపీ ఇండియా 9వ వార్షిక సదస్సులో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేయబడింది. మధుమేహ వ్యాధి నియంత్రణకు సుదీర్ఘ కాలంగా డాక్టర్ సదాశివరావు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఆయనను ఘనంగా సత్కరించిన నిర్వాహకులు గవర్నర్స్ రికగ్నిషన్ అవార్డును అందజేశారు. అవార్డు అందుకున్న అనంతరం బెంగళూరు చేరుకున్న డాక్టర్ సదాశివరావు, అక్కడ జరిగిన ఓ వైద్య సదస్సులో అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కాలి పుండ్లకు ప్రత్యామ్నాయ చికిత్సలు అనే అంశంపై ఆయన పేపర్ ప్రెజెంటేషన్ చేశారు. కాలి పుండ్ల చికిత్సకు సంబంధించి అందుబాటులోకి వచ్చిన నూతన క్రీమ్ గురించి తన ప్రసంగంలో డాక్టర్ సదాశివరావు తెలియజేశారు.

ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న సందర్భంగా డాక్టర్ యలమంచి సదాశివరావును పలువురు వైద్యులు ఘనంగా సత్కరించారు. సూర్యారావుపేటలోని ఆరిజన్ హాస్పిటల్ నందు గురువారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సదాశివరావును పుష్పగుచ్ఛాలు, దుశ్శాలువలతో సన్మానించిన వైద్యులు.. మధుమేహ వ్యాధి చికిత్సా రంగంలో ఆయన అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ యలమంచి సదాశివరావు మాట్లాడుతూ, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇండియా చాప్టర్ వారిచే అందజేయబడిన ఈ పురస్కారం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గత 38 సంవత్సరాలుగా ఉబకాయంపై ఎన్నో పరిశోధనలు చేసి డయాబెటిస్ తగ్గించేందుకు డయాబెటిస్ఫూట్ అనే విధానాన్ని తీసుకువచ్చామని దీనివలన 90 శాతం సక్సెస్ రేట్ కూడా సాధించామన్నారు. దీనితో పాటే డయాబెటిస్ రివర్స్ అనే విధానాల ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచే నూతన విధానానికి బీజం వేశామన్నారు. మధుమేహ వ్యాధి చికిత్స, నియంత్రణ, అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. మన దేశంలో 40 శాతం మంది ప్రజలు డయాబెటిస్ ముప్పు ముంగిట ఉన్నారని అన్నారు. వచ్చే ఐదేళ్లలో వీరు మధుమేహ వ్యాధి బారిన పడే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. క్రమానుగతంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం, జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహం బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని అన్నారు. తగినంత వ్యాయామం చేయడం, సక్రమమైన ఆహారపు అలవాట్లతో ఆరోగ్యకరంగా జీవించాలని డాక్టర్ సదాశివరావు సూచించారు. శరీర బరువును అదుపులో ఉంచుకోవడం మద్యమేహ వ్యాధి నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలియజేశారు.
డాక్టర్ యలమంచిలి సదాశివరావును ఆరిజన్ వైద్య సిబ్బంది సత్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ యలమంచి హిమన, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ అమూల్య, పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *